Begin typing your search above and press return to search.

స్టన్నింగ్ లుక్ లో గ్లామర్ విందు వడ్డిస్తున్న ప్రీతి ముకుందన్..

ప్రీతి ముకుందన్ విషయానికి వస్తే.. ఈ ఏడాది మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా వచ్చిన కన్నప్ప సినిమాలో హీరోయిన్గా నటించి, తన అందంతో నటనతో అందరిని ఆకర్షించింది.

By:  Madhu Reddy   |   19 Dec 2025 1:05 PM IST
స్టన్నింగ్ లుక్ లో గ్లామర్ విందు వడ్డిస్తున్న ప్రీతి ముకుందన్..
X

ప్రముఖ హీరోయిన్ ప్రీతి ముకుందన్ తాజాగా స్టన్నింగ్ లుక్ లో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బ్రౌన్ కలర్ మినీ షార్ట్ ఫ్రాక్ ధరించిన ఈమె.. తన అందాలతో హొయలు పోయింది. సూర్యుడి కిరణాలు తాకుతున్న వేళ తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుందని చెప్పవచ్చు. మిరుమెట్లు గొలిపే కాటుక కళ్ళతో అందరిని కట్టిపడేస్తోంది. ఇక తాజాగా ప్రీతి ముకుందన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. స్టన్నింగ్ లుక్కులో గ్లామర్ విందు వడ్డిస్తోంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. మరికొంతమంది ఈమె అందానికి ఫిదా అవుతూ లవ్, ఫైర్ ఏమోజీలను కామెంట్ రూపంలో షేర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే అభిమానులను ఆకట్టుకుంటూ.. ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న ప్రీతి ముకుందన్.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మరింత మెప్పిస్తున్నాయి.




ప్రీతి ముకుందన్ విషయానికి వస్తే.. ఈ ఏడాది మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా వచ్చిన కన్నప్ప సినిమాలో హీరోయిన్గా నటించి, తన అందంతో నటనతో అందరిని ఆకర్షించింది. ముఖ్యంగా మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , ప్రభాస్, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన విషయం తెలిసిందే. ఇందులో మంచు విష్ణు సరసన నటించిన ప్రీతి ముకుందన్ భారీ పాపులారిటీ అందుకుంది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరిచారు.




ఈమె ఎవరో కాదు తమిళ అమ్మాయి. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో 2001 జూలై 30న జన్మించింది. ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డాక్టర్లే కావడం గమనార్హం . ఈమె మాత్రం బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తిరుచ్చి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ప్రీతి ముకుందన్ తెలుగు అమ్మాయి కానప్పటికీ తన కెరీర్ ను మాత్రం తెలుగులోనే మొదలు పెట్టింది. అలా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమా ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టింది. అయితే ఈ సినిమాలో ఆయేషా ఖాన్ హైలెట్ అయిన రేంజ్ లో ప్రీతి ముకుందన్ కి గుర్తింపు లభించలేదు.




తర్వాత యంగ్ హీరో కెవిన్ హీరోగా వచ్చిన స్టార్ అనే సినిమాలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలతో పోల్చుకుంటే కన్నప్ప సినిమా పెద్ద మూవీ మాత్రమే కాదు ఇందులో భారీతారాగణం కూడా భాగమైంది. పైగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవ్వడంతో ఈ సినిమాలో ఈమెకు మరింత క్రేజ్ లభించింది. మొత్తానికి అయితే కన్నప్ప సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఓం భీమ్ బుష్ తర్వాత చేసిన మ్యూజిక్ వీడియో ఆశ కూడ ఇంటర్నెట్ ను బాగా కుదిపేసింది. ఈ పాటతో విపరీతమైన పాపులారిటీ లభించింది.