సినిమా బండి, శుభమే కాదు అయనలో 'అతడు'!
'సినిమా బండి', 'శుభమ్' సినిమాలతో డైరెక్టర్ గా పరిచమయ్యాడు ప్రవీణ్ కండ్రేగుల. రెండు సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునే తీసుకొచ్చాయి.
By: Srikanth Kontham | 18 Aug 2025 9:00 AM IST'సినిమా బండి', 'శుభమ్' సినిమాలతో డైరెక్టర్ గా పరిచమయ్యాడు ప్రవీణ్ కండ్రేగుల. రెండు సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునే తీసుకొచ్చాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు రెండూ ఓ సెక్షన్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యాయి. దీంతో ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు బాగానే అందుకుంటున్నారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో 'పరదా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడవ చిత్రంతోనూ డీసెంట్ హింట్ అందుకుంటాడు? అన్న ధీమాని వ్యక్తం చేసారు.
థియేటర్లో డైరెక్టర్ విజిల్స్:
ఈ నేపథ్యంలో కమర్శియల్ సినిమాల ప్రస్తావన రాగా? ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనలో అతడుని పరిచయం చేసారు. కమర్శియల్ సినిమాలు చేయాలని తనకీ ఉందన్నాడు. ఇటీవల రీ రిలీజ్ అయిన 'అతడు' సినిమా చూసి థియేటర్లో ఊలలు వేసి డాన్సులు చేసి వచ్చినట్లు తెలిపారు. అయితే కమర్శియల్ సినిమా అవకాశం రావాలంటే ముందు తనని తాను నిరూపించుకోవాలని..ఒకేసారి కమర్శి యల్ సినిమా అంటే ఎవరూ ఛాన్స్ ఇవ్వరని...అందుకే చిన్న చిత్రాలతో మొదలై తదుపరి తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తానన్నారు.
మాలీవుడ్ ని మించిన కంటెంట్:
చిన్న సినిమాలతో సక్సెస్ అందుకున్న తర్వాత హీరోలకు, నిర్మాతలకు తనపై నమ్మకం కలుగుతుం దన్నారు. చాలా మంది దర్శకులు ఈ రకమైన స్ట్రాటజీ అనుసరించే సక్సస్ అయిన వాళ్లే అన్నారు. అలాగే `పరదా`ని ఉద్దేశించి మాట్లాడారు. మలయాళంలో కంటెంట్ ప్రధానమైన సినిమాలొస్తుంటాయని అంటారు. మలయాళం వాళ్లు కూడా 'పరదా' చూసిన తర్వాత వాళ్లను మించిన బలమైన కంటెంట్ ఉందని మెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేసారు.
అసలైన నటిని చూస్తారు:
సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఈ సినిమా కథ విని తెలుగులో ఇలాంటి కథా అని ఆశ్చర్యపోయారు.ఆయన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా పని చేస్తుందన్నారు. ఇప్పటి వరకూ అనుపమని కేవలం కమర్శియల్ నాయికగానే చూసారన్నారు. కానీ ఈ సినిమా ద్వారా అనుపమలో అసలైన నటిని ప్రేక్షకులు చూస్తారని ధీమా వ్యక్తం చేసారు.
