పెళ్లయిన హీరోల పక్క చూపుల భోగోతం కథలు
అయితే ప్రతీక్ ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణం అతడు ఎదుర్కొన్న పరిస్థితులు అని అర్థం చేసుకోవాలి.
By: Sivaji Kontham | 7 Feb 2026 9:00 AM ISTజిగిబిగి గ్లామర్ ప్రపంచంలో చాలా వరకూ పెళ్లిళ్లు పెటాకులుగా మారడానికి కారణాలపై తాజాగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ స్మితా పాటిల్ (ప్రతీక్ బబ్బర్) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలీవుడ్ లో పెళ్లి అంటే ఒక జోక్ లా మారిపోయందని, పెళ్లి బంధం అంతా ఫేక్ అని అతడు కామెంట్ చేసాడు. ఇక్కడ 90 శాతం వివాహబంధాలు ముసుగుతోనే ఉన్నాయి. పరిశ్రమ వ్యక్తులుగా ఇవన్నీ మాకు తెలుసు అని ప్రతీక్ అతడి భార్య ప్రియా బెనర్జీ ఘాటుగా స్పందించడం చర్చగా మారింది.
అతడి వ్యాఖ్యల వ్యవహారం పూర్తిగా పెళ్లయిన స్టార్ల పక్క చూపుల గురించి బోల్డ్ గా బహిర్గతం చేయడమేనని నెటిజనులు విశ్లేషిస్తున్నారు. హిందీ చిత్రసీమలో పలువురు అగ్ర హీరోలు ఇప్పటికే తమ భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతిని కూడా గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ ముసుగు వేసిన పెళ్లిళ్లు. పైకి ఒకలా ఉంటారు.. లోన జరిగేది ఇంకొకటి. గ్లామర్ రంగంలో సక్సెస్ ముఖ్యం. దానికోసం కాపురంలో కలతలు ఉన్నా కానీ, పైకి నవ్వుతూ కనిపిస్తుంటారని కూడా పలుమార్లు ఇన్ సైడర్స్ కామెంట్ చేసిన సందర్భాలున్నాయి.
అయితే ప్రతీక్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటి? అనేది ఆరా తీస్తే ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. నిజానికి ప్రతీక్ స్మితా పాటిల్ జీవితం పూర్తిగా స్ట్రగుల్ తో కూడుకున్నది. అతడి తండ్రి రెండు వివాహాలు చేసుకోవడం ఒక కుదుపు. అతడి సోదరి కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు ప్రతీక్ కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. అతడు వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. మొదటి భార్య సన్యా చౌదరితో విడాకులు అయింది. ఆ తర్వాత ప్రియా బెనర్జీని పెళ్లాడాడు. ఇప్పుడు ఈ జంట ఓ ఇంటర్వ్యూలో గ్లామర్ ప్రపంచంలో వివాహ బంధాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. నిజానికి ప్రియా బెనర్జీతో ప్రతీక్ పెళ్లయినప్పుడు ఈ పెళ్లికి అతడి తండ్రి రాజ్ బబ్బర్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయింది. ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని హోస్ట్ ప్రశ్నించగా, బాలీవుడ్ లో వివాహ బంధాలపై ప్రతీక్ - ప్రియా జంట ఘాటు వ్యాఖ్యలు చేసారు.
అయితే ప్రతీక్ ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణం అతడు ఎదుర్కొన్న పరిస్థితులు అని అర్థం చేసుకోవాలి. అతడు తన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని ఇదే ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ తర్వాత తన తల్లి ఇంటి పేరుతో తన పేరును కూడా మార్చుకున్నాడు. ప్రతీక్ బబ్బర్ లో బబ్బర్ తండ్రి తరపు (రాజ్ బబ్బర్) నుంచి వచ్చినది. దానిని తొలగించి తల్లి తరపు నుంచి `స్మితా పాటిల్`ని జోడించాడు. ఈ పేరు మార్పు పరిశ్రమలో చాలా చర్చనీయాంశమే అయింది.
అయితే ప్రతీక్ స్టెప్ బ్రదర్ మాత్రం అతడి చర్యలను నిరసించాడు. మా నాన్న రెండు పెళ్లిళ్లు నిజమే. నా సోదరి రెండో పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు ప్రతీక్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. చివరికి మా ఇంట్లో కుక్కకు కూడా ఇద్దరు గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు! అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ప్రతి మగాడు ఇలా పెళ్లిళ్లు చేసుకుంటాడని ప్రతీక్ తండ్రి రాజ్ బబ్బర్ అన్నట్టు కూడా కథనాలొచ్చాయి.
నిజానికి ప్రతీక్ స్మితా పాటిల్ బాల్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అందుకే అతడి వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఇక బాలీవుడ్‌లో ఇటీవల జరుగుతున్న వరుస విడాకులు, విడిపోవడాల నేపథ్యంలో ప్రతీక్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
