టాలీవుడ్ యువ సంచలనం కరణ్ తో చర్చలా?
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ప్రశాంత్ తాను చేయాల్సిందల్లా బ్యాకెండ్ లో సైలెంట్ గా చేసేస్తున్నట్లు కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 17 Feb 2026 5:00 AM ISTటాలీవుడ్ యువ సంచలనం ప్రశాంత్ వర్మ కొంత కాలంగా స్తబ్దుగా ఉన్నాడు. పాన్ ఇండియాలో `హనుమాన్` లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా? ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. దర్శక, నిర్మాతగా కొన్ని సినిమాలు ప్రకటించాడు గానీ అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రశాంత్ వర్మ కాస్త నిరుత్సాహ పడటం వాస్తవం. అప్పటి నుంచి యువ దర్శకుడు ఏ విషయాన్ని మీడియా ముందుకు తీసుకురావడం లేదు. నిర్మాతగా మొదలు పెట్టిన ప్రాజెక్ట్ సైతం నెమ్మదిగానే ముందుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సైలెంట్గా ఉంటే అంత ఉత్తమం అనుకున్నాడో ఏమో గానీ ప్రశాంత్ పేరు మాత్రం ఎక్కడా వినిపంచడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ప్రశాంత్ తాను చేయాల్సిందల్లా బ్యాకెండ్ లో సైలెంట్ గా చేసేస్తున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో ఓ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరుపుతున్నాడుట. ఇటీవలే రెండు సార్లు ఇద్దరి మధ్య ముంబైలో భేటి జరిగినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. మరి చర్చలు ఫలించాయా? లేదా? అన్నది తెలియదు గానీ ప్రశాంత్ మాత్రం బాలీవుడ్ పై సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే కరణ్ జోహార్ అనుకున్నది కూడా జరిగినట్లే.
పాన్ ఇండియాలో ఫేమస్ అయిన తెలుగు డైరెక్టర్లను బాలీవుడ్ కి తీసుకెళ్లాలని ఎంతో కాలంగా కరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. `బాహుబలి` అనంతరం రాజమౌళితో హిందీలో సినిమా తీయాలనుకున్నాడు. ఎన్నో ఆఫర్లు ఇచ్చాడు. కోట్ల రూపాయలు ఆఫర్ చేసాడు. అయినా జక్కన్న నో చెప్పాడు. అటుపై సుకుమార్ కి కూడా కరణ్ టచ్ లోకి వెళ్లారు. అతడు కూడా నో చెప్పాడు. అలాగే ప్రశాంత్ నీల్..రిషబ్ శెట్టి లాంటి వాళ్లను టచ్ లోకి తీసుకున్నాడు. వారు తమ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పట్లో వీలు పడదని చెప్పేసారు. అలా వాళ్లంతా నో చెప్పడంతో? కరణ్ కూడా లాభం లేదనుకుని సైలెంట్ అయిపోయాడు.
మాతృ భాషను వదిలేసి హిందీకొచ్చి సినిమాలు తీయరని ఆలస్యంగా అర్దం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా? నిర్మాణం పరంగా మూవ్ అయ్యాడు. ఈ క్రమంలో తెలుగు సినిమాల్ని బాలీవుడ్ లో రిలీజ్ చేయడం ప్రారంభించాడు. దీంతో దర్శకులతో ర్యాపో కూడా మొదలైంది. తాజాగా ప్రశాంత్ వర్మను లైన్ లోకి తేవడంతో? విషయం ఆసక్తికరంగా మారింది. ఇతడు లాక్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు హీరోలంతా బిజీగా ఉన్నారు. ఇప్పట్లో వాళ్లతో సినిమా చేయడం అసాధ్యం. కరణ్ తో టై అప్ అయితే హిందీ హీరోలు హ్యాండ్స్ లోకి వస్తారు. పైగా కరణ్ తో సినిమా అంటే ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకొచ్చేదే. కాబట్టి కరణ్ ఆఫర్ కు ప్రశాంత్ వర్మ లాక్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
