నీల్ నెక్స్ట్ ప్లాన్.. అనుకున్నట్లు క్లిక్ అయితే..
అదే జోష్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ హీరోగా సలార్ రూపొందించారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
By: M Prashanth | 27 May 2026 9:00 AM ISTస్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో స్పెషల్ బ్రాండ్ గా మారిపోయింది. రా అండ్ రస్టిక్ యాక్షన్, భారీ ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే దర్శకుల్లో ఆయన ముందుంటున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆయన సినిమాలపై నేషనల్ వైడ్ గా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న లైనప్ చూస్తే.. రాబోయే కొన్నేళ్ల పాటు బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి.
దర్శకుడిగా ప్రశాంత్ నీల్ జర్నీ ఉగ్రమ్ సినిమాతో మొదలైన సంగతి తెలిసిందే. కన్నడ హీరో శ్రీమురళితో తెరకెక్కించిన ఆ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే అసలు టర్నింగ్ పాయింట్ మాత్రం కేజీఎఫ్. హీరో యశ్ తో కలిసి రూపొందించిన ఆ సినిమా కన్నడ ఇండస్ట్రీ స్థాయి ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో చర్చకు తెచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే వసూళ్ళ పరంగా కొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.
అదే జోష్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ హీరోగా సలార్ రూపొందించారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దీంతో నీల్ తర్వాత ప్రాజెక్టులపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ తో తెరకెక్కుతున్న డ్రాగన్ పై ఉంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశభక్తి బ్యాక్ డ్రాప్ తో పాటు నీల్ మార్క్ యాక్షన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.
ఇక్కడితో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఆగిపోలేదని తెలుస్తోంది. డ్రాగన్ తర్వాత అదే కథను మరో భాగంగా కొనసాగించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. మరోవైపు సలార్ 2 కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమాతో ప్రభాస్-నీల్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ ను టార్గెట్ చేయనుంది. అదే సమయంలో అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మాత్రం కేజీఎఫ్ 3. యశ్ తో మరోసారి ప్రశాంత్ నీల్ జతకడితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పై చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా భారీ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నీల్ లైనప్ మొత్తం అనుకున్నట్టుగా సెట్స్ పైకి వెళ్లి, విజయాలు సాధిస్తే మాత్రం ఆయన మరింత పెరగడం ఖాయమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఒకే సమయంలో ఎన్టీఆర్, ప్రభాస్, యశ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయడం చిన్న విషయం కాదు. పైగా ఆయన సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ స్ట్రాంగ్ గా ఉండటం ప్రత్యేకతగా చెప్పాలి. అందుకే ప్రస్తుతం ఇండియన్ కమర్షియల్ సినిమాల్లో ప్రశాంత్ నీల్ పేరు గట్టిగా మార్మోగుతోంది.
