రాధేశ్యామ్.. నీల్ కామెంట్ కు అసలు అర్థమేంటి?
ప్రశాంత్ నీల్ ప్రెజెంటర్ గా వ్యవహరించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 418 సినిమా ప్రమోషన్లలో ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.
By: M Prashanth | 24 Oct 2026 10:29 AM ISTసినిమా ఏదైనా సరే.. అందులో తనదైన ముద్ర కనిపించాలను కుంటారు దర్శకులు. ముఖ్యంగా స్టోరీకి తగ్గ ఎన్విరాన్మెంట్ ను స్క్రీన్ పై చూపించేందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే ఇదే విషయం ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ తో చర్చనీయాంశమైంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాను గుర్తు చేస్తూ నీల్ వేసిన పంచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఆ కామెంట్ వెనుక ఉన్న అసలు విషయం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రశాంత్ నీల్ ప్రెజెంటర్ గా వ్యవహరించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 418 సినిమా ప్రమోషన్లలో ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. కీర్తన్ గౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు నటించారు. ఆ సినిమా ట్రైలర్ చూసిన ప్రభాస్.. మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆ సమయంలో ప్రశాంత్ నీల్ తో సరదాగా మాట్లాడారు.
418 విజువల్స్ డార్క్ గా ఉన్నాయని, మీ మూవీల్లో కనిపించే ఎన్విరాన్మెంట్ ఇందులోనూ ఉందని ప్రభాస్ అన్నారు. దీంతో నీల్ వెంటనే.. మరి దీన్ని రాధేశ్యామ్ లా తీస్తే బాగుండదు కదన్నా అంటూ పంచ్ వేశారు. దీంతో ప్రభాస్ నవ్వుతూ.. సలార్ 2 షూటింగ్ లో నీ సంగతి చెబుతా అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్ ను కేవలం ప్రభాస్ సినిమాపై వేసిన సెటైర్ గా చూడలేం.
రెండు సినిమాల కథలు, వాటి బ్యాక్ డ్రాప్స్, స్క్రీన్ పై కనిపించే విధానం ఎంత భిన్నంగా ఉంటాయో ఆ కన్వర్జేషన్ చెబుతోంది. రాధేశ్యామ్ ఒక ప్రేమకథ. విక్రమాదిత్య, ప్రేరణల మధ్య సాగే లవ్ జర్నీనే మెయిన్ అట్రాక్షన్. అందులో ప్రేమ, విధి, ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మరోవైపు 418 హారర్ థ్రిల్లర్. ప్రేక్షకుల్లో భయాన్ని కలిగించే వాతావరణం, డార్క్ మోడ్ ఇలాంటి సినిమాలకు అవసరం.
అందుకే ఆ రెండు సినిమాల విజువల్స్ మధ్య తేడా ఉండటం సహజం. ప్రశాంత్ నీల్ సినిమాలను గమనిస్తే.. డార్క్ విజువల్స్, స్ట్రాంగ్ రోల్స్, భారీ యాక్షన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కేజీఎఫ్, సలార్ సినిమాల్లోనూ ఆ స్టైల్ క్లియర్ గా కనిపించింది. అయితే ఆయన సమర్పించిన 418 కూడా అదే తరహా విజువల్స్ తో ఉండటాన్ని ప్రభాస్ ప్రస్తావించారు. దానికి నీల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
హారర్ సినిమాను రాధేశ్యామ్ లా చూపిస్తే దాని అసలు వాతావరణం దెబ్బతింటుందనే అర్థంలో ఆయన అన్నారు. అయితే ఆ కామెంట్స్ ను ప్రభాస్ పై వ్యక్తిగత విమర్శగా చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్, చనువు కారణంగానే ఆ కన్వర్జేషన్ సాగింది. కానీ రాధేశ్యామ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ ను అందుకోకపోవడంతో, ఆ మూవీ పేరు ప్రస్తావనకు రావడం కొందరి దృష్టిని ఆకర్షించింది.
