పాన్ ఇండియా కోసం దేశం దాటుతోన్న ద్వయం!
ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లు అంటే? దాదాపు ఇండియాలోనే జరుగుతుంటాయి. అందులోనూ ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ లోనే పూర్తి చేస్తుంటారు.
By: Srikanth Kontham | 27 Oct 2025 1:26 PM ISTప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లు అంటే? దాదాపు ఇండియాలోనే జరుగుతుంటాయి. అందులోనూ ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ లోనే పూర్తి చేస్తుంటారు. ఆయన రాసుకున్న కథలకు సెట్స్ మాత్రమే అనుకూలంగా ఉంటాయని వాలైనంత వరకూ వాటిలోనే ముగిస్తుంటారు. `కేజీఎఫ్`, `సలార్` చిత్రాలు అలా సెట్స్ పూర్తి చేసిన చిత్రాలే. వీటికోసం ప్రత్యేకంగా వీదేశీ షెడ్యూల్స్ అంటూ వేసింది లేదు. కథకు తగట్టు భారీ సెట్లు నిర్మించుకుని అందులోనే పూర్తి చేసారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న `డ్రాగన్` కోసం తొలిసారి ప్రశాంత్ నీల్ దేశం దాటబో తున్నాడు.
ట్యూనీషియా కంటే ముందే హైదరాబాద్ లో షూట్:
తాజాగా ట్యూనీషియాలో చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యనీషియాలో వారం రోజుల పాటు లొకేషన్ల వేట కొనసాగించనున్నారు. ప్రశాంత్ నీల్ తో పాటు కీలకమైన వ్యక్తులు ఆయనతో పాటు ట్యూనీషియాకు వెళ్తున్నారని తెలిసింది. దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండి మంచి లోకేషన్లను ఎంపిక చేయనున్నారు. అనంతరం నవంబర్ లో ట్యూనీషియాకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ ప్రారంభించనున్నారు. అయితే ట్యూనీషియాకు చేరక ముందే హైదరాబాద్ లో ఓ చిన్న షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
తారక్ స్లిమ్ లుక్ అక్కడ హైలైట్ :
చేతిలో ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్ లో ఈ చిన్న షెడ్యూల్ పూర్తి చేస్తే పనవుతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నారు. ట్యూనీషియా నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ మొదలవుతుంది. అయితే హైదరబాద్ షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. తారక్ మాత్రం ట్యూనీషియా షెడ్యూల్ కు సంబంధించి సన్నధం అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే తారక్ బరువు తగ్గిన సంగతి తెలిసిందే. బాగా సన్నగా మారిపోయారు. సినిమా లో తారక్ ప్రత్యేక లుక్ కోసం చాలా శ్రమించారు. వీలైనంత స్లిమ్ లుక్ లోకి ట్రాన్సపర్ అయ్యారు.
ట్యూనీషియా షెడ్యూల్ పై ఆసక్తికరంగా:
ఆ లుక్ కూడా సరిపోదని ప్రశాంత్ నీల్ ఆదేశించడంతో ఇంకా స్లిమ్ అవుతున్నారు. ట్యూనీషియా షెడ్యూల్ సినిమాకు ఎంతో కీలకం కావడంతోనే తారక్ ఇలా సన్నధం అవుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని చిత్ర వర్గాల నుంచి తెలిసింది. దీనికి సంబంధించి భారీ ఎత్తున స్థానిక ఫైటర్లను రిక్రూట్ చేసుకుంటున్నారుట. ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలంటే ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. దీంతో ట్యూనీషియా షెడ్యూల్ పై ఆసక్తి సంతరించుకుంది.
