Begin typing your search above and press return to search.

బన్నీతో బాలీవుడ్ హీరో... ఇక బాక్సాఫీస్ తగలబడిపోద్ది

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటి హొంబలే ఫిల్మ్స్.

By:  M Prashanth   |   6 Aug 2025 6:05 PM IST
బన్నీతో బాలీవుడ్ హీరో... ఇక బాక్సాఫీస్ తగలబడిపోద్ది
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటి హొంబలే ఫిల్మ్స్. కేజీఎఫ్ సినిమాలు, సలార్, తాజాగా మహావతార నరసింహ సినిమాలు ఈ నిర్మాణ సంస్థ నుంచే వచ్చి భారీ హిట్లు కొట్టాయి. దీంతో శాండల్‌వుడ్ లో హోంబలే సంస్థకు ఓ క్యాలిబర్ క్రియేట్ అయ్యింది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ తోనూ ఫ్యుచర్ లో ఇంకో రెండు సినిమాలు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.

తాజాగా మరోవార్త సంచనలం సృష్టిస్తుంది. ఈ నిర్మాణ సంస్థ బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, దక్షిణ భారత ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అలాగే ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్, కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తుంది.

ఈ కాంబోలో ఈ ప్రాజెక్ట్ పాన్ఇండియా స్థాయిని మించి తెరకెక్కనుందని టాక్. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తుందని అంటున్నారు. అందుకే హొంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ఈ కాంబోను ఒప్పించే పనిలో పడిందట. ఈ ప్రాజెక్ట్ పై చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికే బన్నీ, షారుఖ్ దృష్టికి తీసుకెళ్లాయని సమాచారం.

ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ దర్శకత్వంలో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ గా తెరకెక్కుతుందని, అలాగే ఇది భారతీయ సినీ ఇండస్ట్రీలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఇంతటీ భారీ కాస్ట్ ఉన్న ప్రాజెక్ట్ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ ఒకవేళ ఈ సినిమా గానీ ఓకే అయితే మాత్రం ఈ డికేడ్ లోనే భారీ యాక్షన్ సినిమా అయ్యే ఛాన్స్ ఉంది.

మరోవైవు, ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది సన్ పిక్చర్స్ పై రూపొందుతుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరెకెక్కిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే షారుఖ్ కింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా గెలుచుకు్నారు. జవాన్ సినిమాలో నటనకుగానూ షారుఖ్ కు ఈ పురస్కారం దక్కింది.