Begin typing your search above and press return to search.

హ్యాపీ బర్త్ డే ప్రశాంత్ నీల్.. లోపాన్నే ఆయుధంగా మార్చుకున్న పాన్ ఇండియా డైరెక్టర్!

ఇండియన్ బాక్సాఫీస్‌ను కేజీఎఫ్, సలార్ సినిమాలతో షేక్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీళ్ పుట్టినరోజు నేడు. దీంతో సినీ సెలబ్రిటీలు, ప్రేక్షకులు అభిమానులు అందరూ ఆయనకు విషెస్ తెలుపుతున్నారు.

By:  Madhu Reddy   |   4 Jun 2026 4:48 PM IST
హ్యాపీ బర్త్ డే ప్రశాంత్ నీల్.. లోపాన్నే ఆయుధంగా మార్చుకున్న పాన్ ఇండియా డైరెక్టర్!
X

ఇండియన్ బాక్సాఫీస్‌ను కేజీఎఫ్, సలార్ సినిమాలతో షేక్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీళ్ పుట్టినరోజు నేడు. దీంతో సినీ సెలబ్రిటీలు, ప్రేక్షకులు అభిమానులు అందరూ ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసి, తన విభిన్నమైన టేకింగ్‌తో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన ప్రశాంత్ నీళ్ ప్రయాణం నిజంగా ఒక థ్రోబ్యాక్ ఇన్‌స్పిరేషన్. తనకున్న ఒక చిన్న లోపాన్నే సినిమా స్క్రీన్ మీద ఒక అద్భుతమైన ఆయుధంగా మార్చుకుని ఆయన ఎలా సక్సెస్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉగ్రమ్ నుండి మొదలైన ప్రస్థానం:

ప్రశాంత్ నీళ్ కెరీర్ మొదటికి వెళ్లి చూస్తే.. 'ఉగ్రమ్' అనే కన్నడ యాక్షన్ సినిమాతో ఆయన ఫిల్మ్‌మేకింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 2014లో వచ్చిన ఈ మూవీ కన్నడ సినీ పరిశ్రమలో భారీ వసూళ్లు సాధించి, అప్పటి హిట్ మూవీలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1, 2 చిత్రాలతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకేసారి ఐదు భాషల్లో రిలీజైన కేజీఎఫ్.. కలెక్షన్ల సునామీ సృష్టించి ఆయనను పాన్ ఇండియా డైరెక్టర్‌ని చేసింది.

ఆ 'నలుపు' వెనుక ఉన్న ఓసీడీ సీక్రెట్:

ప్రశాంత్ నీళ్ సినిమాల్లో మనకు ఎక్కువగా డార్క్, మోనోక్రోమ్ అంటే నలుపు, బూడిద రంగుల విజువల్స్ కనిపిస్తాయి. అయితే ఈ స్టైల్ వెనుక ఆయనకున్న ఒక రకమైన (ఓసీడీ) అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. నిజ జీవితంలో కూడా ఆయనకు కలర్స్ దుస్తులు వేసుకోవటం అసలు ఇష్టం ఉండదు. తనకున్న ఈ అలవాటే సినిమాల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇక నటులు ఎవరైనా నలుపు కాకుండా ఆలివ్ గ్రీన్ లాంటి ముదురు రంగులు వేసుకున్నా.. దాన్ని బ్లాక్ కలర్‌లోకి మార్చమని కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌తో పట్టుబడతారట. అయితే ఈ విషయాన్ని సలార్ సినిమా విడుదల సమయంలో రాజమౌళికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రశాంత్ నీళ్ పంచుకున్నారు.

హీరోలకు ఆ 'బ్లాక్ బన్యన్' ట్రేడ్‌మార్క్:

ప్రశాంత్ నీళ్ సినిమాల్లో హీరోల ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. కేజీఎఫ్‌లో యశ్ అయినా, సలార్‌లో ప్రభాస్ అయినా.. వాళ్లకు కామన్ గా ఒక మురికిపట్టిన, స్లీవ్‌లెస్ బ్లాక్ బన్యన్ వేయించడం నీళ్ మార్క్ స్టైల్. తన సినిమా ప్రపంచంలోని రఫ్ గా,కక్కసమైన వాతావరణాన్ని చూపించడానికి ఈ ఏకవర్ణ రూపం చాలా అవసరమని ఆయన నమ్ముతారు. సలార్ వరకు ఇదే ఫార్ములాతో డార్క్ కలర్ ఎలివేషన్ ఇచ్చి ఇండస్ట్రీ హిట్లు కొట్టారు.

ప్రెజెంట్ సినారియో.. ఎన్టీఆర్‌తో 'డ్రాగన్':

ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1969 కాలం నాటి గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో సాగే ఒక ఎపిక్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో ఎన్టీఆర్ ఒక పవర్‌ఫుల్ డార్క్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. అనిల్ కపూర్, రుక్మిణి వంటి స్టార్ నటీనటులు భాగమవుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ లో భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం నీళ్ తన పాత డార్క్ స్టైల్ పక్కనబెట్టి, కొంచెం రంగులమయమైన కొత్త విజువల్స్ చూపించబోతున్నారని టాక్.

తనకున్న ఒక పర్సనల్ ఓసీడీ ప్రాబ్లమ్‌ను సినిమా స్క్రీన్‌పై ఒక విజువల్ వండర్‌గా మార్చి, దాన్నే తన సిగ్నేచర్ స్టైల్ చేసుకున్న ప్రశాంత్ నిజంగా గ్రేట్. సలార్ నుండి ఇప్పుడు రాబోతున్న 'డ్రాగన్' వరకు ఆయన క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ పవర్‌ఫుల్ డైరెక్టర్ రాబోయే రోజుల్లో ఎన్టీఆర్‌తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. వండర్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ కి మనమూ ఒకసారి హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం.