నీల్ స్టైల్‌కే ట్విస్ట్.. ‘డ్రాగన్’లో కొత్త టచ్
ప్రశాంత్ నీల్ సినిమాల్లో డార్క్ టోన్ ఒక సిగ్నేచర్‌లా మారిపోయింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చూస్తే బ్లాక్, గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
By: M Prashanth | 31 Aug 2026 7:17 PM ISTప్రశాంత్ నీల్ సినిమాల్లో డార్క్ టోన్ ఒక సిగ్నేచర్‌లా మారిపోయింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చూస్తే బ్లాక్, గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ కూడా మొదటి నుంచి అదే రఫ్ మూడ్‌లో ఉంటుందనే అంచనా ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం కలర్‌ఫుల్‌గా, వైబ్రెంట్‌గా డిజైన్ చేస్తున్నారనే టాక్ బయటకు వచ్చింది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఫ్లాష్‌బ్యాక్‌కు వేరే కలర్ ప్యాలెట్ పెట్టడం వల్ల కథలో రెండు టైమ్ పీరియడ్స్‌ను ఈజీగా వేరు చేయడానికి ఉపయోగపడొచ్చు. ప్రస్తుతం కనిపించిన ‘డ్రాగన్’ లుక్ మాత్రం డ్రై, రఫ్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంది. గతానికి సంబంధించిన సీన్స్‌ను పూర్తి ఆపోజిట్ కలర్ లో చూపిస్తే ఎన్టీఆర్ పాత్రలోనీ మార్పు ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది.
అయితే క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్ కథలో పెద్ద భాగమా, లేక కొన్ని ఎపిసోడ్స్‌కే పరిమితమా అన్నది ఇంకా తెలియదు. కానీ ఫ్లాష్‌బ్యాక్ కోసం ప్రత్యేకంగా లుక్ డిజైన్ చేస్తున్నారనే టాక్ వల్ల అక్కడ కొత్త క్యారెక్టర్స్, వేరే లొకేషన్స్, మరో సెటప్ ఉండొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. నీల్ సినిమాల్లో బ్యాక్‌స్టోరీకి ఎక్కువ స్పేస్ ఉండటం కొత్త విషయం కాదు. ‘డ్రాగన్’లో అది ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.
షూటింగ్ మాత్రం ప్రస్తుతం ఎన్టీఆర్ బ్రేక్ కారణంగా కొంత స్లో అయింది. షూటింగ్ సమయంలో భుజానికి గాయం కావడంతో ఆపరేషన్ జరిగింది. దాంతో రెగ్యులర్ షూట్‌కు కొంత గ్యాప్ వచ్చింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ఎన్టీఆర్ మళ్లీ సెట్స్‌లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. హీరో కాంబినేషన్‌లో ఉండాల్సిన సీన్స్‌ను దానికి తగ్గట్టుగా టీమ్ రీషెడ్యూల్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల విజువల్ ఐడెంటిటీలో కెమెరా వర్క్‌కు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈసారి ఒకే సినిమాలో డార్క్ వరల్డ్‌తో పాటు బ్రైట్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటే లైటింగ్, ఫ్రేమింగ్, కాస్ట్యూమ్స్ వరకు రెండు భాగాలకు వేరే ట్రీట్‌మెంట్ అవసరం అవుతుంది. ఇక ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ అయిన తర్వాత ‘డ్రాగన్’కు సంబంధించిన పెద్ద షెడ్యూల్స్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.
ఇక ‘డ్రాగన్’ను 2027 జూన్ 11న థియేటర్లలోకి తీసుకురానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. షూటింగ్‌కు మధ్యలో గ్యాప్స్ వచ్చినా రిలీజ్ డేట్‌కు ఇంకా మంచి టైమ్ ఉంది. అందుకే అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ మళ్లీ సెట్స్‌లోకి వస్తే మిగిలిన షెడ్యూల్స్‌ను ప్లాన్ ప్రకారం పూర్తి చేసే అవకాశం ఉంది.
