#PNU కూడా సిద్దమవుతుందా!
దీన్ని ఓ యూనివర్శ్ గా ప్రకటించి అందులోకి తదుపరి స్టార్ హీరోలతో సినిమాలు చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నాడుట.
By: Srikanth Kontham | 28 Sept 2025 5:00 PM ISTఇప్పటికే టాలీవుడ్ లో సీక్వెల్స్..ప్రాంచైజీలు..సినిమాటిక్ యూనివర్శ్ లు అంటూ కొత్త ట్రెండ్ మొదలైంది. స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ వర్మ, కొరటాల శివ లాంటి వారు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. తమ డిమాండ్ ని బట్టి ఒక కథని ఎన్ని విధాలుగా చూపించాలి? అన్నది నిర్ణయించుకుని ముందుకెళ్తున్నారు. త్వరలో మరింత మంది దర్శకులు ఈ జాబితాలో చేరనున్నారు. ఈ నేపత్యంలో యాక్షన్ సంచలనం ప్రశాంత్ నీల్ కూడా తన పేరిట యూనివర్శ్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. `కేజీఎఫ్` తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్లతో:
`కేజీఎఫ్` ప్రాంచైజీ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు పాన్ ఇండియలో సంచలనమైనే చిత్రాలే . ఈ సిరీస్ తో కన్నడ నటుడు యశ్ పెద్ద స్టార్ అయ్యాడు. అటుపై ప్రభాస్ తో `సలార్` ప్రాంచైజీ మొదలు పెట్టాడు. `సలార్ సీజ్ ఫైర్` ఇప్పటికే రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. తదుపరి `సలార్ -2` `శౌర్యాంగ పర్వం` మొదలవుతుంది. ఈ భాగం వచ్చే ఏడాది పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `డ్రాగన్` చేస్తున్నాడు. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్. ఎర్ర సముంద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. `కేజీఎఫ్`, `సలార్` ను ఒకే బ్యాక్ డ్రాప్లో చూపించాడు.
ముగ్గురు స్టార్లతో మల్టీస్టారర్:
అందుకోసం కథకు అవసరమైన సెట్లు వేసి షూటింగ్ అంతా అందులోనే చేసాడు. కానీ `డ్రాగన్` మాత్రం
అందుకు భిన్నంగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ షూటింగ్ అంతా రియల్ లోకేషన్స్ లోనే జరిగింది. ఎలాంటి సెట్స్ వేయలేదు. మరి ఈ సినిమా కథ సెట్స్ ని డిమాండ్ చేయలేదా? అన్నది తెలియాలి. ఆ సంగతి పక్కన బెడితే? ఇప్పుడీ ముగ్గురు స్టార్లను ఓ యూనివర్శ్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలిసింది. యశ్, ప్రభాస్, ఎన్టీర్ లను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ముగ్గురితో ఓ భారీ చిత్రం చేయాలని చూస్తున్నాడుట.
ఆ ముగ్గురు కూడా సీన్ లోకి:
దీన్ని ఓ యూనివర్శ్ గా ప్రకటించి అందులోకి తదుపరి స్టార్ హీరోలతో సినిమాలు చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నాడుట. అంటే హాలీవుడ్ లో మావెరిక్ అవెంజర్స్ తరహాలో తన యూనివర్శ్ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు పాన్ ఇండియా స్టార్లతో పని చేసిన నేపథ్యంలో తదుపరి రామ్ చరణ్, బన్నీ, మహేష్ లను తన అధీనంలోకి తెచ్చుకుంటే? సరి తాను అనుకున్నది సునాయాసంగా చేయగలడు.
