Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్ శిష్యుడి హారర్ ఎంట్రీ.. జూలై 31న థియేటర్లలోకి 418

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో తనదైన ముద్ర వేసిన డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నప్పటికీ, కొత్త టాలెంట్ ను ఎంక‌రేజ్ చేయ‌డంలోనూ ముందుంటున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 July 2026 5:11 PM IST
ప్రశాంత్ నీల్ శిష్యుడి హారర్ ఎంట్రీ.. జూలై 31న థియేటర్లలోకి 418
X

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో తనదైన ముద్ర వేసిన డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నప్పటికీ, కొత్త టాలెంట్ ను ఎంక‌రేజ్ చేయ‌డంలోనూ ముందుంటున్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కీర్తన్నాడ గౌడను డైరెక్ట‌ర్ గా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న హారర్ డ్రామా 418 ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.





సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజైనప్ప‌టి నుంచే ఈ ప్రాజెక్టుపై పై సినీ వర్గాల్లో ప్రత్యేక చ‌ర్చ మొదలైంది. పోస్టర్‌లో కనిపించిన డార్క్ విజువల్స్, మిస్టీరియస్ కాన్సెప్ట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

హారర్ జానర్‌లో ఇప్పటివరకు చూడని విధంగా భయాన్ని అనుభూతి చెందేలా సినిమా రూపొందించామని చిత్ర యూనిట్‌ చెబుతోంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియ‌న్స్ ను వెంటాడే అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కథ, వాతావరణం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ట్రీట్ అన్నీ కలిసి ఆడియ‌న్స్ కు విభిన్నమైన హారర్ ఎక్స్‌పీరియెన్స్ ను అందిస్తాయని సమాచారం.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి టెక్నిక‌ల్ అంశాల‌పై స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హారర్ సినిమాల్లో అత్యంత కీలకమైన టెక్నికల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మాణ విలువలను అందించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంటోంది.

ప్రశాంత్ నీల్ శిష్యుడిగా కీర్తన్నాడ గౌడ చేస్తున్న తొలి ప్రయత్నం కావడం కూడా ఈ సినిమాకు కు ఎక్స్‌ట్రా ఎట్రాక్ష‌న్ గా మారింది. కెజీఎఫ్, సలార్ లాంటి భారీ సినిమాల ఎక్స్‌పీరియెన్స్ ఆయన డైరెక్ష‌న్ లో ఎంతవరకు ప్రతిబింబిస్తుందో చూడాలనే ఆసక్తి సినీ అభిమానుల్లో ఉంది. రీసెంట్ గా హారర్ సినిమాల‌కు ఆడియ‌న్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో 418 కూడా అదే జోరును కొనసాగిస్తుందా అనే చర్చ మొదలైంది. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హారర్ డ్రామా నిజంగానే మేకర్స్ చెబుతున్నట్లుగా థియేటర్లలో భయానక అనుభూతిని కలిగిస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.