Begin typing your search above and press return to search.

OG వైబ్ లో అకీరా - నీల్.. ఇలాంటి డైరెక్టర్ తో కలిస్తే ఊచకోతే!

ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ ఓజీ మూవీ మ్యానియా నడుస్తోంది.

By:  M Prashanth   |   25 Sept 2025 10:51 AM IST
OG వైబ్ లో అకీరా - నీల్.. ఇలాంటి డైరెక్టర్ తో కలిస్తే ఊచకోతే!
X

ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ ఓజీ మూవీ మ్యానియా నడుస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. ఓ మినీ ఫెస్టివల్ గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు.. ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. థియేటర్స్ దద్దరిల్లేలా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

అలా వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ ఫ్యాన్స్.. ఓజీ వైబ్ లో ఉన్నారు. వారే కాదు.. పవన్ కొడుకు అకీరా నందన్ కూడా తన తండ్రి మూవీ వైబ్స్ లోనే ఉన్నాడు. కచ్చితంగా పవన్ ప్రతీ మూవీ చేసే అకీరా.. ఇప్పుడు ఓజీని కూడా థియేటర్స్ లో చూశాడు. హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో ఆడియన్స్ మధ్యలో కూర్చుని ఎంజాయ్ చేశాడు.

సెక్యూరిటీ రీజన్స్ వల్ల సీక్రెట్ గా థియేటర్స్ లోకి వచ్చిన అకీరా.. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో రెడ్ టవల్ చేతబట్టి మరీ సినిమా చూశాడు. పవన్ స్క్రీన్ పై కనపడితే చాలు.. ఈలలు వేస్తూ.. ఎంజాయ్ చేశాడు. ఆ సమయంలో అకీరాతోపాటు చెల్లి ఆద్య, బావ వైష్ణవ్ తేజ్ ఉన్నారు. అదే థియేటర్ లో ప్రశాంత్ నీల్ కూడా ఓజీ మూవీ చూశారు.

అయితే ప్రశాంత్ నీల్.. అకీరాతో మచ్చటించారు. సరదాగా కాసేపు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అకీరా చాలా వినయంతో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా అవుతున్నాయి. పవన్ లాగే కొడుకు కూడా పెద్దల పట్ల వినయంగా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు.

అదే సమయంలో వారిద్దరి కాంబోలో మూవీ వస్తే ఓ రేంజ్ లో ఉంటుందని అనేక మంది సినీ ప్రియులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రశాంత్ నీల్.. తనదైన శైలిలో మూవీలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన మేకింగ్ అండ్ మాస్ టేకింగ్ తో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అందుకున్నారు.

ఇటు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తారని ఇప్పటికీ క్లారిటీ వచ్చేసింది. కానీ ఎప్పుడనేది తెలియదు. ఆ మధ్య ఓజీ మూవీతో డెబ్యూ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ నిజం కాదు. దీంతో ఇప్పుడు అకీరా.. నీల్ తో వర్క్ చేస్తే ఊచకోతే అని అంటున్నారు. అకీరా కటౌట్ కు తగ్గట్టు సరైన క్యారెక్టరైజేషన్ చేయగలరు నీల్. అందుకే వారిద్దరూ సినిమా చేయాలని కోరుకుంటున్నారు. మరి ఫ్యూచర్ లో ఎప్పుడైనా అలా జరుగుతుందేమో చూడాలి.