ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఇదే కరెక్ట్ టైం .. ఎందుకంటే?
వాస్తవానికి హను మాన్ తర్వాత వెంటనే జై హనుమాన్ ను సెట్స్ పైకి తీసుకెళ్లి, ఈ ఇయర్ సంక్రాంతికి దాన్ని రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ ముందు ప్లాన్ చేసుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Nov 2025 1:37 PM ISTఎప్పుడైనా ఒకే ప్లాట్ తో సినిమాలు వచ్చినా, ఒకే తరహా జానర్లో ఎక్కువ సినిమాలు వచ్చినా సాధారణంగానే కంపేరిజన్స్ మొదలవుతుంటాయి. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు ఈ పోలికలు సహజం. తాము తీసుకున్న లైన్ తో లేదంటే కొంచెం ఇంచుమించు ఆ లైన్ కు దగ్గరగా ఉండే లైన్ ను టచ్ చేస్తే సదరు మేకర్స్ కంగారు పడి తమ ప్రాజెక్టును ముందు రిలీజ్ చేయాలనుకోవడం కామన్.
హనుమాన్ తో భారీ హిట్
ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అదే చేస్తున్నట్టు అనిపిస్తోంది. గతేడాది హను మాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాగా రిలీజైన హను మాన్ ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హను మాన్ సినిమాను రామాయణంతో లింక్ చేసి నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను అనౌన్స్ చేశారనేది తెలిసిన విషయమే.
జై హనుమాన్ లో మెయిన్ లీడ్ గా రిషబ్
వాస్తవానికి హను మాన్ తర్వాత వెంటనే జై హనుమాన్ ను సెట్స్ పైకి తీసుకెళ్లి, ఈ ఇయర్ సంక్రాంతికి దాన్ని రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ ముందు ప్లాన్ చేసుకున్నారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల జై హనుమాన్ లేటవుతూ వచ్చింది. జై హనుమాన్ సినిమాలో మెయిన్ లీడ్ గా రిషబ్ శెట్టి నటిస్తున్నారు. వేరే సినిమాలతో రిషబ్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు.
జై హనుమాన్ కు డేట్స్ ఇచ్చిన రిషబ్
అయితే తాజా సమాచారం ప్రకారం జై హనుమాన్ సినిమాకు రిషబ్ శెట్టి జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల డేట్స్ ను కేటాయించారని తెలుస్తోంది. రీసెంట్ గా కాంతర చాప్టర్1 తో మంచి హిట్ ను అందుకున్న రిషబ్ నుంచి నెక్ట్స్ రాబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. ఎలాగూ రిషబ్ డేట్స్ ఇచ్చారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని ప్రశాంత్ వర్మ కూడా భావిస్తున్నారట.
అసలే రీసెంట్ గా రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న వారణాసి మూవీలో కూడా జక్కన్న తన సినిమా కథను రామాయణంకు లింక్ చేయడంతో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ విషయంలో తొందరపడుతున్నట్టు అనిపిస్తోంది. పైగా రీసెంట్ గా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి, తనకు మధ్య జరిగిన కాంట్రవర్సీలకు కూడా ఈ సినిమాతో చెక్ పెట్టాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తవడంతో వీలైనంత త్వరగా జై హనుమాన్ ను పూర్తి చేసి త్వరగా దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అతను భావిస్తున్నారట. హను మాన్ తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ వర్మ, ఈసారి జై హనుమాన్ తో ఎలాంటి రికార్డులు అందుకుంటారో చూడాలి.
