యువ సంచలనం లైనప్ లో క్లారిటీ మిస్!
`హనుమాన్` విజయంతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో సంచలనమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లు వసూళ్లు సాధించడంతో? అన్ని పరిశ్రమల్లోనూ ప్రశాంత్ పేరు మార్మోగింది.
By: Srikanth Kontham | 8 Sept 2025 8:45 AM IST`హనుమాన్` విజయంతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో సంచలనమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లు వసూళ్లు సాధించడంతో? అన్ని పరిశ్రమల్లోనూ ప్రశాంత్ పేరు మార్మోగింది. దీంతో ఒక్కసారిగా అతడి స్పాన్ పెరిగింది. హీరోలంతా అతడితో పని చేయడానికి ముందుకొచ్చారు. నిర్మాతలు అడ్వాన్సులు అలాగే గమ్మరించారు. ప్రశాంత్ నుంచి కూడా సినిమా అనౌన్స్ మెంట్లు అలాగే వెల్లు వెత్తాయి. కానీ ఇప్పుడాయన ఏ సినిమా చేస్తున్నాడు? ముందుగా ఏ సినిమా రిలీజ్ అవుతుంది? దర్శకుడిగా వస్తున్నాడా? నిర్మాతగా వస్తున్నాడా? అంటే ఎలాంటి క్లారిటీ లేకుండా ఉంది.
సీక్వెల్ సంగతేంటో?
సొంత బ్యానర్ లో `మహాకాళీ` అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ పట్టాలెక్కిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. ఈ సినిమాకు తాను కేవలం నిర్మాత మాత్రమే. అలాగే `హను మాన్` కి సీక్వెల్ గా `జై హనుమాన్` నిర్మిస్తున్నాడు. ఇందులో హనుమాన్ పాత్రలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి పోషిస్తున్నాడు. పస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు.
చేతినిండా సినిమాలే:
అలాగే నిర్మాత డీ.వీ.వీ దానయ్య కుమారుడిని పరిచయం చేస్తూ `అధీర` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ సినిమా సంగతేంటో కూడా తెలియదు. ఈ సినిమాకు దర్శకుడు మారాడని ప్రచారం లో ఉంది. మరి ఏకారణంగా అన్నది అదో సందేహం. ఇంత బిజీలోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా అంటూ మరో ప్రకటన కూడా వచ్చింది. ఆసినిమా సంగతేంటో కూడా తెలియదు. ఇంకా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయన్నాడు. అదీ కూడా క్లారిటీ లేదు.
క్లారిటీ ఇచ్చేది ఎప్పుడో:
అలాగే నటసింహ బాలకృష్ణ తనయుడు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ బాధ్యతలు తనకే అప్పగిం చినట్లు అధికారికంగా ప్రకటించారు. అది అక్కడికే పరిమితమైంది. ఆ సినిమా ఉందా? లేదా? అన్నది ఇంత వరకూ ఎలాంటి వివరణ లేదు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో కూడా సినిమా చేస్తున్నట్లు ప్రకట నొచ్చింది. ఆ సినిమా కూడా ఉందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ రద్దు అయినట్లు ప్రచా రంలోకి వచ్చింది. ఇవన్నీ పక్కన బెడితే అసలు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఏ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు? అన్నది అంతు చిక్కని ప్రశ్న. మరి వీటన్నింటిపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేది ఎప్పుడో.
`హనుమాన్` విజయంతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో సంచలనమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లు వసూళ్లు సాధించడంతో? అన్ని పరిశ్రమల్లోనూ ప్రశాంత్ పేరు మార్మోగింది. దీంతో ఒక్కసారిగా అతడి స్పాన్ పెరిగింది. హీరోలంతా అతడితో పని చేయడానికి ముందుకొచ్చారు. నిర్మాతలు అడ్వాన్సులు అలాగే గమ్మరించారు. ప్రశాంత్ నుంచి కూడా సినిమా అనౌన్స్ మెంట్లు అలాగే వెల్లు వెత్తాయి. కానీ ఇప్పుడాయన ఏ సినిమా చేస్తున్నాడు? ముందుగా ఏ సినిమా రిలీజ్ అవుతుంది? దర్శకుడిగా వస్తున్నాడా? నిర్మాతగా వస్తున్నాడా? అంటే ఎలాంటి క్లారిటీ లేకుండా ఉంది.