ప్రశాంత్ వర్మ నుంచి మరో సీక్వెల్
విభిన్న చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం మాత్రమే కాకుండా కమర్షియల్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.
By: Ramesh Palla | 24 Aug 2025 2:06 PM ISTవిభిన్న చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం మాత్రమే కాకుండా కమర్షియల్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ! సినిమా మొదలుకుని ప్రతి సినిమా విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన సూపర్ హిట్ మూవీ హనుమాన్ కి సీక్వెల్‌ను చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటి వరకు జాబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో తేజ సజ్జాకు కమర్షియల్ హిట్స్‌ను అందించిన ప్రశాంత్ వర్మ మరోసారి తేజా సజ్జాతో జత కట్టేందుకు రెడీ అయ్యాడు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో..
హనుమాన్ సినిమాతో తేజ సజ్జా ఒక్కసారిగా స్టార్ గా నిలిచాడు. ఆయన హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆ సినిమాలోని వైబ్ పాటకు మంచి స్పందన దక్కి అంచనాలు పెంచేసింది. ఆకట్టుకునే కథ కథనంతో పాటు సూపర్ మ్యాన్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. హీరో తేజ సజ్జా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ మద్య కాలంలో ఆయనను ఎంతో మంది దర్శకులు సంప్రదించినా కొత్త సినిమాను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అయ్యాడు.
జాంబీరెడ్డికి సీక్వెల్‌గా
జాంబీ రెడ్డి, హనుమాన్ సినిమాలతో తనకు బిగ్ బ్రేక్ ను అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎలాంటి అనుమానం లేకుండా తేజ సజ్జా సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. రాయలసీమ నుంచి ప్రపంచం అంతం వరకు అంటూ ఒక క్యాప్షన్‌తో సినిమాను ప్రకటించారు. దాంతో ఈ సినిమా జాంబీ రెడ్డి సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. జాంబీ రెడ్డి సినిమాలో హీరో ను వీడియో గేమ్ క్రియేటర్‌గా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ వీడియో గేమ్ నేపథ్యం ఉండబోతున్నట్లు ప్రీ లుక్ లో క్లారిటీ ఇచ్చారు. దాంతో జాంబీ రెడ్డికి ఇది సీక్వెల్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా విడుదల తర్వాత ఈ కొత్త సినిమాను అధికారికంగా ముందుకు తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
మిరాయ్ తర్వాత తేజా సజ్జా మూవీ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అంటూ చాలా సినిమాలు ప్రకటన వస్తున్నాయి. అందులో ఒకటి రెండు సినిమాలు క్యాన్సల్ అయ్యాయి. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు నమ్మకం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే జాంబీ రెడ్డి కి సీక్వెల్ అన్నట్లుగా ఇంత క్లీయర్‌గా సినిమాను ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ కూడా ఇంతకు ముందు సినిమాలు క్యాన్సల్ కావడంతో ఈ సినిమా విషయంలో మరింత శ్రద్దను కనబర్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న జై హనుమాన్ సినిమా హిట్ అయితే ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
