ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు..?
జై హనుమాన్ కాస్టింగ్ విషయంలోనే చాలా టైం తీసుకున్నాడు ప్రశాంత్ వార్మ. ఫైనల్ గా కాంతార స్టార్ రిషబ్ శెట్టితో సినిమా లాక్ చేసుకున్నాడు.
By: Ramesh Boddu | 1 Aug 2025 7:00 AM ISTఅ! తో కెరీర్ మొదలు పెట్టి ప్రతి సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వచ్చాడు ప్రశాంత్ వర్మ. లాస్ట్ ఇయర్ హనుమాన్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ప్రకటించాడు. అది 2025 లో రిలీజ్ అని అనౌన్స్ చేశాడు కానీ అది జరిగే ఛాన్స్ లేదు. అసలు జై హనుమాన్ ఇంతవరకు షూటింగ్ మొదలు పెట్టలేదు.
రిషబ్ శెట్టితో సినిమా లాక్..
జై హనుమాన్ కాస్టింగ్ విషయంలోనే చాలా టైం తీసుకున్నాడు ప్రశాంత్ వార్మ. ఫైనల్ గా కాంతార స్టార్ రిషబ్ శెట్టితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఫస్ట్ లుక్ గ్లింప్స్ గా ఒక వీడియో కూడా వదిలారు. కానీ ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు. జై హనుమాన్ ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. అసలు మొదలవుతుందా లేదా అన్నది కూడా డౌటే అంటున్నారు.
మరోపక్క రిషబ్ శెట్టి వరుస సినిమాలు చేస్తున్నాడు. కాంతారా ప్రీక్వెల్ తో పాటుగా మరో రెండు సినిమాలు చేస్తున్నాడు రిషబ్ శెట్టి. అందులో ఒకటి ఛత్రపతి శివాజి కథతో ఒకటి చేస్తుండగా.. మరోటి సితార బ్యానర్ లో ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతో రిషబ్ బిజీ బిజీ అవుతున్నాడు. ఈ టైంలో జై హనుమాన్ కి డేట్స్ ఇస్తాడా అన్నది డౌట్ గానే ఉంది.
మోక్షజ్ఞ తో సినిమా అనౌన్స్..
ఇదే కాదు ప్రశాంత్ వర్మ మహాకాళీ అని.. రన్వీర్ సింగ్ తో ఒక సినిమా కూడా ఒకటి అనుకుని క్యాన్సిల్ చేసుకున్నాడు. నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తో కూడా ఒక సినిమా అనౌన్స్ చేసి వెనక్కి తగ్గాడు ప్రశాంత్ వర్మ. మరి డైరెక్టర్ గా టాలెంట్ ఉన్నా అతని ప్రాజెక్ట్ ల విషయంలో జరుగుతున్న ఈ మిస్ క్లారిటీ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాల ప్లానింగ్ లో ఏదో తేడా కొడుతుంది. సరిగా ప్లాన్ చేయకపోతే మాత్రం చిన్నగా కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది. సో ప్రశాంత్ వర్మ ఈ విషయంలో జాగత్త పడాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఏ ప్రాజెక్ట్ మీద ఉన్నాడు. నెక్స్ట్ అతని స్టెప్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ నుంచి ఈమధ్య ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఏం చేస్తాడో చూడాలి.
