Begin typing your search above and press return to search.

రామాయ‌ణం, వార‌ణాసి త‌ర్వాతే ప్ర‌శాంత్ వ‌ర్మ డిసైడ్!

ఈ నేప‌థ్యంలో `రామాయ‌ణం`, `వారాణాసి` థియేటర్లలోకి వచ్చి గ్లోబల్ వైడ్‌గా సంచలనం సృష్టించిన తర్వాతే ఆ ఊపును కొనసాగిస్తూ `జై హనుమాన్` విడుదల తేదీని అధికారికంగా డిసైడ్ చేయాలని ప్రశాంత్ వర్మ టీమ్ భావిస్తోంది.

By:  Srikanth Kontham   |   29 July 2026 2:29 PM IST
రామాయ‌ణం, వార‌ణాసి త‌ర్వాతే ప్ర‌శాంత్ వ‌ర్మ డిసైడ్!
X

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `జై హనుమాన్ ` పై భారీ అంచనాలు నెలకొన్నాయి. `హనుమాన్` చిత్రంతో టాలీవుడ్ స్థాయిని గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసిన యువ సంచ‌ల‌నం ఇప్పుడు ఈ సీక్వెల్‌ను భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో.. అలాగే ప్రమోషనల్ వ్యూహాల విషయంలో ప్రశాంత్ వర్మ పక్కా ప్లానింగ్‌తో ముందువెళ్తున్నట్లు క‌నిపిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ `రామాయ‌ణం`.. `వారాణాసి` విడుదల తర్వాతే `జై హనుమాన్` రిలీజ్ ఉండొచ్చనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.

ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉందనేది ట్రేడ్ వర్గాల అంచనా. `రామాయ‌ణం`, `వారాణాసి` చిత్రం ద్వారా గ్లోబల్ స్థాయిలో మన పురాణ నేపథ్యం, హనుమంతుడి పాత్ర తాలూకు ఇంటెన్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది. ఈ సినిమాలు గ్లోబల్ వైడ్‌గా సంచలనం సృష్టిస్తుందని భారతీయ ఇతిహాసాల పట్ల అంతర్జాతీయ ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తిని .. అవగాహన‌ను ఈ చిత్రం తీసుకొస్తుందని భావిస్తున్నారు. `వార‌ణాసి` చిత్రంలో హనుమంతుడి పాత్ర ..ఆ నేపధ్యం చాలా కీలకంగా ఉండబోతుందనే టాక్ ఉంది. అంత‌కు ముందే హ‌నుమంతుడి పాత్ర ఇదే ఏడాది రిలీజ్ అవుతున్న బాలీవుడ్ `రామాయ‌ణం` వ‌న్ తో సంచ‌ల‌నం కానుంది.

ఇదే `జై హనుమాన్` సినిమాకు అత్యంత కీలకమైన ప్లస్ పాయింట్‌గా మారనుంది. `జై హనుమాన్` లో కూడా హనుమంతుడి పాత్ర .. దైవిక శక్తికి సంబంధించిన అంశాలే ప్రధాన కథాకథనాలుగా నడుస్తాయి. కాబట్టి `రామాయ‌ణంం`, `వార‌ణాసి` సినిమాలు తెచ్చే గ్లోబల్ ఇంపాక్ట్ బాక్సాఫీస్ వద్ద సృష్టించే వైబ్రేషన్స్ నేరుగా జై హనుమాన్ సినిమాపై చాలా బలంగా ఉంటుంద‌ని ప్రశాంత్ వర్మ బలంగా నమ్ముతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడియన్స్‌కు ఈ తరహా జానర్ పరిచయం అయిన తర్వాత తమ సినిమాను విడుదల చేస్తే ఆ రీచ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్న‌ది ఆయ‌న‌ ప్లాన్.

ఇది కేవలం విడుదల తేదీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. సినిమాపై బజ్‌ను ఏ స్థాయిలో క్రియేట్ చేయాలనే దానిపై మేకర్స్ వేస్తున్న పెద్ద వ్యూహం. రాజమౌళి, ప్ర‌శాంత్ నీల్ సినిమా లు ఒక దారిని సుగమం చేస్తే ఆ బాటలో ప్రశాంత్ వర్మ తన సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి అద్భు తమైన అవకాశం అవుతుంది. పాన్-ఇండియా దశ దాటి గ్లోబల్-ఇండియా స్థాయికి తెలుగు చిత్రాలు వెళుతున్న తరుణంలో పెద్ద సినిమాల కలయిక ..వాటి ఇంపాక్ట్ ఒకదానికొకటి తోడ్పడటం ఇండస్ట్రీకి ఎంతో లాభదాయకం.

ఈ నేప‌థ్యంలో `రామాయ‌ణం`, `వారాణాసి` థియేటర్లలోకి వచ్చి గ్లోబల్ వైడ్‌గా సంచలనం సృష్టించిన తర్వాతే ఆ ఊపును కొనసాగిస్తూ `జై హనుమాన్` విడుదల తేదీని అధికారికంగా డిసైడ్ చేయాలని ప్రశాంత్ వర్మ టీమ్ భావిస్తోంది. ఈ తెలివైన నిర్ణయం వల్ల సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకోవడమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమాకు అపూర్వమైన స్పందన లభించే అవకాశం ఉంది. కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న యువ దర్శకుడు బాక్సాఫీస్ వద్ద ప్రతి అడుగును ఎంతో వ్యూహాత్మకంగా వేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ తీసుకుంటున్న ఈ నిర్ణయం `జై హనుమాన్` చిత్రాన్ని సాధారణ పాన్-ఇండియా సినిమాగా కాకుండా నిజమైన గ్లోబల్ అంచనాలతో కూడిన దృశ్యకావ్యంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. `వారాణాసి` సృష్టించే సంచలనాల తర్వాత రాబోతున్న `జై హనుమాన్` మన సినిమా చరిత్రలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.