పరదాలు తొలగిస్తూ అందాలు వల్లిస్తున్న ప్రణీతా సుభాష్!
ఇందులో రెడ్ కార్పెట్ పై నడవడానికి ప్రణీత సుభాష్ మరింత అందంగా ముస్తాబయింది.
By: Madhu Reddy | 19 Sept 2025 1:00 AM ISTఅవకాశం దొరికితే చాలు అభిమానులకు చేరువ అవ్వడానికి హీరోయిన్స్ ఏ ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా సమయం, సందర్భం ఏదైనా సరే తమ అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఈమధ్య కాలంలో ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారికే దర్శక నిర్మాతలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇటు ఫాలోవర్స్ ను కూడా పెంచుకునే పనిలో పడ్డారు సినీ భామలు.
అంతేకాదు సోషల్ మీడియా ద్వారానే కాకుండా ప్రత్యక్షంగా కూడా పబ్లిక్ లో కనిపించి అందరిని అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడ అవార్డు ఫంక్షన్ జరిగినా.. ఏదైనా సినిమా ఈవెంట్ ఉన్నా అక్కడికి వెళ్ళి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో అందాల తార ప్రణీత సుభాష్ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక చాలా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రెడ్ కార్పెట్ పై నడవడానికి ప్రణీత సుభాష్ మరింత అందంగా ముస్తాబయింది.
అందులో భాగంగానే తాజాగా డీప్ వీ నెక్ కలిగిన క్రిస్టల్ బాడీ కాన్ డ్రెస్ ధరించి తన అందాలతో మరొకసారి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. పరదాలను జరుపుతూ అందాలను వల్లిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫాలోవర్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వీపు అందాలు చూపెడుతూ అభిమానులను మరింత హీటెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ప్రణీత సుభాష్ ధరించిన ఈ ట్రెండీ అవుట్ ఫిట్ అభిమానులలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అని చెప్పవచ్చు.
ప్రణీత సినిమా జీవితం విషయానికి వస్తే.. తొలిసారి తనీష్ హీరోగా వచ్చిన 'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె పవన్ కళ్యాణ్ - సమంత కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. బావ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ 2018 లో చివరిగా హలో గురు ప్రేమకోసమే అనే సినిమాలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది.
2021లో ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఏడడుగులు వేసిన ఈమె బెంగళూరులోనే సెటిల్ అయిపోయింది. 2022లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈమె.. మళ్లీ ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఈమె అందం విషయంలో ఏమాత్రం లోటు కనిపించడం లేదు అనడంలో సందేహం లేదు. ఎప్పటికప్పుడు తన గ్లామర్డోస్ పెంచేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా స్వీట్ 16 లా కనిపిస్తూ అందరి హృదయాలను దోచుకుంటుంది ప్రణీత సుభాష్.
