ఫోటోటాక్ : అందాల ప్రణీత స్టైలిష్ షో
ఈ అమ్మడు పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంది.
By: Ramesh Palla | 1 Aug 2025 12:02 PM ISTకన్నడ మూవీ 'పోర్కి'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రణీత సుభాష్ టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. 2010లో 'ఎమ్ పిల్లో ఎమ్ పిల్లాడో' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినా కూడా బావా సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ప్రణీత తమిళ్‌లో ఉదయన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కన్నడం, తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేసిన ప్రణీత సుభాష్ సౌత్ ఇండియాలో మంచి పేరు దక్కించుకుంది. పవన్ కళ్యాణ్‌తో నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాతో టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా ప్రణీత నిలిచింది. తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల కారణంగా ప్రణీత వార్తల్లో నిలుస్తూ ఉంది.
పెళ్లి తర్వాత వరుస సినిమాలతో ప్రణీత సుభాష్
ఈ అమ్మడు పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంది. గత ఏడాది ఈమె నటించిన తంకమణి, రమణ అవతారం సినిమాల్లో నటించింది. ఈ ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రణీత సుభాష్ హీరోయిన్‌గా కాకుండా ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు సినిమాల్లో కనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్‌లో ప్రణీత సుభాష్ ఒకరు. ఈమె తెలుగులో చివరగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది. ఆ సినిమాలో గెస్ట్ రోల్ అయినప్పటికీ సీనియర్ హీరోయిన్ కృష్ణ కుమారిగా మెప్పించింది.
ప్రణీత అందాల ఫోటో షూట్
ప్రణీత సినిమాలతోనే కాకుండా రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. వయసు పెరుగుతున్నా, తల్లి అయినా కూడా ప్రణీత చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ప్రణీత అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ కలర్ షర్ట్ వేసుకున్న ప్రణీత పై బటన్ తొలగించి మరీ క్లీ వేజ్ షో చేస్తూ కవ్విస్తోంది. ఈ స్టైలిష్ అందాల ఆరబోత ఫోటోలకి నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందం తో పాటు ప్రణీత కళ్లలో మెరుపు కనిపిస్తుందని అంటున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోయిన్స్
తెలుగులో 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో ఆకట్టుకుంది. టాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెళ్లి అయిన సమయంలో ఆ తర్వాత ప్రెగ్నెంట్ సమయంలో ప్రణీత సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేయడం కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్స్ వరుసగా సినిమాలు, సిరీస్‌లు చేస్తున్నారు. కనుక ప్రణీత సైతం ఇక ముందు మరిన్ని సినిమాలు, సిరీస్‌లు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఆమె నుంచి మరిన్ని సినిమాలు వస్తాయా అనేది చూడాలి.
