Begin typing your search above and press return to search.

వెకేషన్ లో సెల్ఫ్ లవ్.. గ్లామర్ టచ్ తో ప్రణీత!

తాజాగా ప్రణీత సుభాష్ షేర్ చేసిన ఈ ఫోటో గ్యాలరీ విషయానికి వస్తే..ఇంటర్ కాంటినెంటల్ మాల్దీవ్స్ లో మామూనగాన్ రిసార్ట్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది.

By:  Madhu Reddy   |   7 Jun 2026 9:00 PM IST
వెకేషన్ లో సెల్ఫ్ లవ్.. గ్లామర్ టచ్ తో ప్రణీత!
X

గజిబిజి లైఫ్ స్టైల్ లో నిత్యం పని మీదే ఫోకస్ పెడుతూ తమకంటూ సమయాన్ని కేటాయించుకోలేక.. ఫ్యామిలీతో గడపలేక ఇబ్బంది పడే సెలబ్రిటీలు చాలామంది ఉంటారు. అందుకే తమ తమ సినిమాల నుండి లేదా ఇతర పనుల నుండి కాస్త విరామం దొరికితే చాలు వెకేషన్ అంటూ విదేశాలకు వెళ్లిపోయి అక్కడ చిల్ అవుతూ ఉంటారు. అంతేకాదు తమ ఫ్యామిలీతో వాల్యూ టైం స్పెండ్ చేస్తూ స్వాంతన పొందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక బ్యూటీ సెల్ఫ్ లవ్ పొందడమే కాకుండా తన ఫ్యామిలీతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తూ ఆ ఫోటోలను క్యాప్చర్ చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆమె ఎవరో కాదు ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంలో తనీష్ సరసన హీరోయిన్గా నటించి తన అందాలతో.. అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ప్రణీత సుభాష్.

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. అడపాదడపా సినిమాలు చేసి ఈ మధ్య ఇండస్ట్రీకి దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రెడ్ కార్పెట్ పై తన గ్లామర్ టచ్ తో హొయలు పోయి.. ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్న ఈ చిన్నది తాజాగా వెకేషన్ లో భాగంగా సెల్ఫ్ లవ్ పొందుతూనే తన ఫ్యామిలీతో కలిసి సమయాన్ని కేటాయించడానికి విదేశాలకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే అక్కడ తన ఫ్యామిలీతో గడిపిన ఆనందపు క్షణాలను అభిమానులతో పంచుకుంది.

తాజాగా ప్రణీత సుభాష్ షేర్ చేసిన ఈ ఫోటో గ్యాలరీ విషయానికి వస్తే..ఇంటర్ కాంటినెంటల్ మాల్దీవ్స్ లో మామూనగాన్ రిసార్ట్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది. అక్కడ బీచ్ సైడ్ అందాలు చూస్తూ అక్కడే కట్టిన నెట్ ఊయలపై పడుకొని అలల అందాలను ఆస్వాదిస్తూ మరొకవైపు తన దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఈమె తేలికైన వైట్ కో ఆర్డ్ సెట్ ను ధరించి చాలా సింపుల్ గా కనిపించింది. వైట్ స్కూప్ నెక్ ట్యాంక్ టాప్, దీనికి కాంబినేషన్లో డ్రాస్టింగ్ నడుము పట్టి కలిగిన వైట్ కలర్ ఫాంట్ ధరించి సింపుల్గా కనిపించింది. మొత్తానికి అయితే ప్రణీత సుభాష్ షేర్ చేసిన ఈ ఫోటో గ్యాలరీ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.

2010లో పూరీ జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడలో అరంగేట్రం చేసిన ఈమె.. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో అడుగు పెట్టింది. తర్వాత సిద్ధార్థ సరసన తెలుగులో నటించిన బావ సినిమా ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక తర్వాత తమిళ్లో కూడా సినిమాలు చేసిన ఈమె.. అత్తారింటికి దారేదితో మంచి నటిగా పేరు దక్కించుకుంది. పాండవులు పాండవులు తుమ్మెద సినిమా కూడా ఈమెకు మంచి పేరు అందించింది.