ఇద్దరు పిల్లల మమ్మీ అని పిలవగలరా?
వయసు ఒక నంబర్ మాత్రమే... ఏజ్ బార్డర్ క్రాస్ చేసినా వేడెక్కించే అందాలతో గుబులు పెంచే హీరోయిన్‌లకు కొదవేమీ లేదు.
By: Sivaji Kontham | 24 Nov 2025 11:00 PM IST
వయసు ఒక నంబర్ మాత్రమే... ఏజ్ బార్డర్ క్రాస్ చేసినా వేడెక్కించే అందాలతో గుబులు పెంచే హీరోయిన్‌లకు కొదవేమీ లేదు. కానీ 30 వయసుకే పెళ్లి చేసుకుని 33 కే ఇద్దరు పిల్లల్ని కనేసిన ప్రణీత సుభాష్.. ప్రస్తుతం భర్త, పిల్లలే ప్రాణంగా జీవితాన్ని సాగిస్తోంది. నిరంతరం తన హబ్బీ, కుటుంబంతో విదేశీ విహారయాత్రలకు వెళుతోంది.
ఇప్పుడు కూడా ఒక విదేశీ ఎగ్జోటిక్ డెస్టినేషన్ నుంచి వరుస ఫోటోలను షేర్ చేస్తూ గుబులు పెంచుతోంది. ప్రణీత తాజా ఫోటోషూట్ చూసాక ఇ్దరు పిల్లల మమ్మీ అని ఎవరైనా పిలవగలరా? రొటీన్ బికినీ , స్విమ్ సూట్లకు భిన్నమైన డిజైనర్ దుస్తులను ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికీ అత్తారింటికి దారేదిలో బాపు బొమ్మనే తలపిస్తోందనే ప్రశంసలు కురుస్తున్నాయి.
తనదైన అందం.. చేపకళ్లతో మాయ చేస్తున్న ప్రణీత, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అందమైన ఎగ్జోటిక్ లొకేషన్ ని ఆస్వాదిస్తూ కనిపించింది. ఈ ప్రదేశం ఎక్కడ? అని ప్రశ్నిస్తే... గ్రీస్ లోని అందమైన బీచ్ పరిసరాలలో విహరిస్తోంది. తన భర్త పిల్లలతో ఈ అడోరబుల్ మమ్ ఆస్వాధనల్లో ఉంది.
అక్కడ ఇండ్ల డిజైనర్ లుక్ రొటీన్ కి భిన్నంగా కనిపిస్తోంది. ఆహ్లాదకరంగా ఉన్న విశాలమైన వీధుల్లో తిరుగుతున్నప్పటి ఫోటోగ్రాఫ్, వేడి నీటి కొలనులో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోగ్రాఫ్... ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. భర్త నితిన్ రాజు, వారి పిల్లలు అర్నా - జై కృష్ణలతో కలిసి ఈ విహారయాత్రను ఆస్వాధిస్తోంది ప్రణీత.
కెరీర్ మ్యాటర్ కి వస్తే., ఈ బ్యూటీ ఇటీవల వరుసగా కన్నడ, మలయాళంలో నటించింది. పెళ్లి తర్వాతా పాత కమిట్ మెంట్లను ఫుల్ ఫిల్ చేసింది. కానీ రిలీజైన సినిమాలేవీ ఆశించిన విజయాల్ని దక్కించుకోలేదు. ప్రస్తుతం ఈ భామ కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే, సోషల్ మీడియా రెవెన్యూ పైనా ఫోకస్ పెడుతోంది. తదుపరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు కొంత సమయం వేచి చూడాలని భావిస్తోందట.
