Begin typing your search above and press return to search.

నయా ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రణీత.. ఎంత క్యూట్ గా ఉందో!

ఏ ఐ టెక్నాలజీ సరికొత్తగా తీసుకొచ్చిన మరో ట్రెండ్ నానో బనానా.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు అటు రాజకీయ నేతలు కూడా ఈ ట్రెండ్ ను తెగ ఫాలో అయిపోతున్నారు

By:  Madhu Reddy   |   14 Sept 2025 4:00 AM IST
నయా ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రణీత.. ఎంత క్యూట్ గా ఉందో!
X

ఏ ఐ టెక్నాలజీ సరికొత్తగా తీసుకొచ్చిన మరో ట్రెండ్ నానో బనానా.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు అటు రాజకీయ నేతలు కూడా ఈ ట్రెండ్ ను తెగ ఫాలో అయిపోతున్నారు. అలా జెమినీ ఏ ఐ ఓపెన్ చేసి ఇలా తమ ఫోటోలను 3డిగా మార్చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు..ఈ క్రమంలోనే మరో బ్యూటీ కూడా సరికొత్త ట్రెండ్ అయిన నానో బనానాను ఫాలో అవుతూ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆమె ఎవరో కాదు ప్రణీత సుభాష్.

ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే.. అందంలో ఏమాత్రం మార్పు రాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే తన అందంతో అందరినీ ఆకట్టుకుందో.. ఇప్పుడు కూడా ప్రేక్షకులను అలాగే అలరిస్తోంది బాపు బొమ్మ ప్రణీత సుభాష్.. చిన్న పిల్లలా.. క్యూట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా సరికొత్త ట్రెండ్ అయిన ఏఐ నానో బనానాను ఉపయోగించి ఫోటోలను షేర్ చేసింది. అందులో చిన్న పిల్లలా.. పింక్ కలర్ మినీ ఫ్రాక్ ధరించి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

బార్బీ బొమ్మను తలపించేలా తన అందాలతో ఆకట్టుకున్న ఈమె.. అదే ఫోటోకి నానో బనానా ఉపయోగించింది. ఇందులో ఈమె చాలా చక్కగా అందాలతో అబ్బురపరిచింది. మొత్తానికైతే ప్రణీత సుభాష్ క్యూట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

ప్రణీత సుభాష్ కెరియర్ విషయానికి వస్తే.. కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ అందుకున్న ఈమె 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 'బావ' సినిమాలో నటించిన ఈమె.. అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉత్తమ నటి విభాగంలో కన్నడ నుంచి ఫిలింఫేర్ అవార్డును అందుకుంది.

2018లో చివరిగా హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంలో ప్రీతి పాత్రలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో 2021 మే 30న పెళ్లి చేసుకుంది. 2022 జూన్ 10న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈమె.. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ప్రస్తుతం పిల్లల తో సమయాన్ని గడుపుతూనే మరొకవైపు ఇలా గ్లామర్ బ్యూటీగా ప్రేక్షకులను అలరిస్తోంది.

ప్రణీత సుభాష్ బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే.. 1992 అక్టోబర్ 17న బెంగళూరులో వైద్యుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి వైద్యులు, తల్లి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు. వీరిద్దరూ బెంగళూరులో సొంతంగా హాస్పిటల్ కూడా నిర్వహిస్తున్నారు. వీరికి పుట్టిన ఏకైక కుమార్తె ఈ ముద్దుగుమ్మ. ఆర్యన్ ప్రెసిడెంట్ పాఠశాలలో స్కూల్ విద్యను పూర్తి చేసిన ఈమె.. బెంగళూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో చేరింది. కానీ మోడలింగ్, వరుస సినిమాల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసింది ప్రణీత.