వారసుడు కూడా షురూ చేసాడా?
మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కార్ సల్మాన్, పహాద్ పాజిల్, ఉన్నిముకుందన్ లాంటి స్టార్లు సొంత భౄషలో పని చేస్తూనే? తెలుగు సినిమాల్లోనూ మెరుస్తున్నారు.
By: Srikanth Kontham | 28 Oct 2025 11:50 AM ISTటాలీవుడ్ లాంచ్ కోసం ఇతర భాషల హీరోలు కూడా పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు నుంచి పాన్ ఇండియాలో ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే? వచ్చే బజ్ భారీగా ఉండటంతో హీరోలంతా ఎంతో ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమిళ, మలయాళ, కన్నడ స్టార్ హీరోలు నటించిన చిత్రాలన్నీ తెలుగులో క్రమం తప్పకుండా అనువాదమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి మాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కార్ సల్మాన్, పహాద్ పాజిల్, ఉన్నిముకుందన్ లాంటి స్టార్లు సొంత భౄషలో పని చేస్తూనే? తెలుగు సినిమాల్లోనూ మెరుస్తున్నారు.
ఈసారి సీరియస్ గానే ప్లాన్ చేసాడా:
తాజాగా మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ లాల్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా మాలీవుడ్ లో `డియాస్ ఇరాయ్` అనే సినిమా తెరకెక్కుతోంది. నటుడిగా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అయినా ప్రణవ్ కెరీర్ ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. మాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకే పని చేసాడు. సినిమాలకంటే తనకు ట్రావెలింగ్ ఇష్టమని...స్వేచ్ఛగా జీవించడంపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో సినిమాలు సీరియస్ గా చేయలేదు. అయితే రెండు..మూడేళ్లగా సీరియస్ గా సినిమాలు చేస్తున్నాడు. కానీ ప్రణవ్ నటించిన సినిమాలేవి తెలుగులో మాత్రం ఇంత వరకూ అనువాదమవ్వలేదు.
అగ్ర నిర్మాణ సంస్థలో రిలీజ్:
`హృదయం` సినిమా మంచి విజయం సాధించినా? ఆ చిత్రాన్ని తెలుగులో అనువదించలేదు. డబ్ చేసి ఉంటే ఇక్కడా మంచి రెస్పాన్స్ వచ్చేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజా సినిమా `డియాస్ ఇరాయ్` ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. మాలీవుడ్ లో ఈ నెల 31 న రిలీజ్ అవుతున్నా? తెలుగులో మాత్రం నవంబర్ తొలి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ రైట్స్ తీసు కుని రిలీజ్ చేస్తుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ భారీ ఎత్తున జరుగుతుందని తెలుస్తోంది.
వారం గ్యాప్ లో అందుకేనా:
అంతకు ముందు ప్రచారం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ప్రణవ్ ని కూడా వ్యక్తిగతంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రిలీజ్ వారం గ్యాప్ లో చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రిలీజ్ అంటే ఆషామాషీ గా చేస్తే కుదరదు. వారం రోజుల పాటు ప్రమోట్ చేయాలి. వెబ్ మీడియా సహా సోషల్ మీడియాలో ప్రచారం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే తెలుగు రిలీజ్ ఆలస్యంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
