డీయస్ ఈరే ట్రైలర్.. స్టార్ తనయుడు భయపెట్టడానికి రెడీ..!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ కూడా తండ్రి బాటలోనే వెరైటీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
By: Ramesh Boddu | 5 Nov 2025 1:40 PM ISTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ కూడా తండ్రి బాటలోనే వెరైటీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రణయ్ నటించిన హృదయం సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ప్రణవ్ సినిమా మీద సౌత్ అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తి పెంచుకున్నారు. హృదయం తర్వాత వర్షగల్కు శేషం సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చేయలేదు కానీ ప్రణవ్ మోహన్ లాల్ యాక్టింగ్ ఆకట్టుకుంది.
భయపెట్టడానికి వస్తున్నాడు ప్రణవ్ మోహన్ లాల్..
ఇక కొంత గ్యాప్ ఇచ్చి లేటెస్ట్ గా ఒక థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నాడు ప్రణవ్ మోహన్ లాల్. ప్రణవ్ లీడ్ రోల్ లో తాజాగా డీయస్ ఈరే సినిమా వస్తుంది. ఈ సినిమాను రాహుల్ సాదాశివం డైరెక్ట్ చేశారు. డీయస్ ఈరే సినిమా ట్రైలర్ కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉన్నా.. ఆడియన్స్ కి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ విత్ సౌండ్, యాక్షన్, విజువల్, ట్విస్ట్ ఇలా అన్నిటిలో డీయస్ ఈరే ఆకట్టుకునేలా ఉంది.
ప్రణవ్ మోహన్ లాల్ ఈమధ్య సినిమాలకు దూరంగా ఎక్కడో ఒక డెన్ లో ఉంటున్నాడు.. నేచర్ ని ఆస్వాదిస్తూ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఐతే ఈ సినిమా ఎప్పుడు తీశారో ఏంటో తెలియదు కానీ సడెన్ రిలీజ్ డేట్ తో ట్రైలర్ వదిలారు. మలయాళ క్రైం థ్రిల్లర్స్ సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. ట్రైలర్ చూస్తేనే ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. మరి ప్రణవ్ ఈ సినిమాతో ఎలాంటి రీచ్ అందుకుంటాడో చూడాలి.
డీయస్ ఈరే సినిమా నవంబర్ 7న రిలీజ్..
ప్రణవ్ మోహన్ లాల్ చేయాలని అనుకుంటే సేఫ్ సైడ్ గా మంచి కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కానీ అతను నాన్న నడిచిన దారిలోనే విలక్షణ పాత్రలతో మెప్పించాలని చూస్తున్నారు. డీయస్ ఈరే సినిమాను తెలుగులో నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ శుక్రవారం రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు జటాధర రిలీజ్ ఉన్నాయి.
వాటితో పాటు విష్ణు విశాల్ ఆర్యన్ వస్తుంది. ఇప్పుడు ప్రణవ్ మోహన్ లాల్ డీయస్ ఈరే కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఎలాంటి థ్రిల్లర్ సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. థ్రిల్లర్ ఇంపాక్ట్ ఎంత బాగా చూపిస్తే అంత పెద్ద సక్సెస్ అవుతుంది. తెలుగులో ఈ జోనర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తెలుగులో ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఐతే ఈ వీకెండ్ స్ట్రైట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలుగా ఆర్యన్, డీయస్ ఈరే థ్రిల్లర్ జోనర్ లో వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
