'డైస్ ఇరే' టాక్ ఎలా ఉంది?
భూతకాలం, భ్రమయుగం లాంటి మైండ్ బ్లోయింగ్ హారర్ సినిమాల తర్వాత డైరెక్టర్ రాహుల్ సదాశివన్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియెన్స్‌లో అంచనాలు పీక్స్‌లో ఉంటాయి.
By: M Prashanth | 1 Nov 2025 9:04 AM ISTభూతకాలం, భ్రమయుగం లాంటి మైండ్ బ్లోయింగ్ హారర్ సినిమాల తర్వాత డైరెక్టర్ రాహుల్ సదాశివన్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియెన్స్‌లో అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. ఈసారి అతను ప్రణవ్ మోహన్‌లాల్‌తో కలిసి 'డైస్ ఇరే' అనే హారర్ థ్రిల్లర్ తీశాడు. 'హృదయం' లాంటి లవ్ స్టోరీల తర్వాత ప్రణవ్ కూడా సీరియస్ రోల్ చేస్తుండటంతో ఈ కాంబోపై మంచి బజ్ క్రియేట్ అయింది. మరి, ఈ సినిమా ఆడియెన్స్‌ను భయపెట్టిందా లేక నిరాశపరిచిందా అనే వివరాల్లోకి వెళితే..
థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తే, సినిమా చాలా డిజప్పాయింటింగ్ గా ఉందని తెలుస్తోంది. చాలా మంది ఆడియెన్స్ సినిమాలోని ఒక్క పాజిటివ్ పాయింట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు, అదే క్రిస్టో జేవియర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్. సౌండ్, బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. సినిమా మూడ్‌ను, ఆ హారర్ ఫీల్‌ను సౌండ్ డిజైన్ అద్భుతంగా ఎలివేట్ చేసిందని చాలా మంది ప్రశంసిస్తున్నారు.
కానీ, సినిమాకు కావాల్సిన అసలు సిసలైన హారర్ ఎలిమెంట్స్, దడ పుట్టించే సీన్లు సినిమాలో పూర్తిగా మిస్ అయ్యాయని కొందరు ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. రాహుల్ సదాశివన్ సినిమా నుంచి కనీసం కొన్ని జెన్యూన్ హారర్ సీన్లు ఆశించాం. కానీ, సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా భయపెట్టే సీన్ లేదని నిరాశ వ్యక్తం చేశారు.
సినిమా నడిచిన విధానం కూడా ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్లుంది. సినిమా రన్‌టైమ్ రెండు గంటలే అయినా, చాలా స్లోగా, లాగదీసినట్లు అనిపించిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు రిపీట్ అవుతూ బోర్ కొట్టించాయని, సినిమా కథ కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉందని, కాస్త హారర్ సినిమాలు చూసే ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్లు క్లైమాక్స్ ట్విస్ట్‌ను ఈజీగా ఊహించొచ్చని అంటున్నారు.
ప్రణవ్ మోహన్‌లాల్ నటన మాత్రం చాలా బాగుందని ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. ఒక పారానార్మల్ సిచువేషన్‌లో చిక్కుకున్న యంగ్‌స్టర్‌గా, ఆ భయాన్ని, కన్ఫ్యూజన్‌ను ప్రణవ్ చాలా బాగా హైలెట్ చేసినట్లు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. జయ కురుప్, అరుణ్ అజికుమార్ లాంటి మిగిలిన నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్‌గా, సౌండ్ ఉంది కానీ, మేటర్ లేదు అని కొందరు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఈ టాక్ ను తట్టుకొని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.
