పెళ్లికి పిలవరని తెలిసీ ఏంటీ వెటకారం? రక్షిత్ శెట్టి ఫ్రెండుకు చీవాట్లు!
టాలీవుడ్ అగ్ర కథానాయిక రష్మిక మందన్న తన ప్రేమికుడు విజయ్ దేవరకొండను పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 21 Feb 2026 9:47 AM ISTటాలీవుడ్ అగ్ర కథానాయిక రష్మిక మందన్న తన ప్రేమికుడు విజయ్ దేవరకొండను పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రాజస్థాన్ ఉదయ్ పూర్ కోటలో ఈ వివాహం జరగనుందని కథనాలొస్తున్నాయి. అయితే ఈ పెళ్లి వేళ రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి.
తాజాగా ప్రమోద్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. నవ్వుతూ, వెటకారంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అతడి వ్యాఖ్యల సారాంశం ఇలా ఉంది.``నాకు ఇంకా రష్మిక పెళ్లి ఆహ్వానం అందలేదు.. ఒకవేళ వస్తే వెళ్తాను`` అని అన్నాడు. అయితే రష్మిక మమ్మల్ని పిలవదని మాకు తెలుసు.. ఇందులో కొత్తేమీ లేదని అన్నాడు. ఇక రష్మిక- రక్షిత్ జంట నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. రక్షిత్ శెట్టి చాక్లెట్ తింటూ బాధపడే చిన్న పిల్లాడు కాదు! అని వ్యాఖ్యానించాడు. అతడు రష్మికపై వ్యంగ్యంగా వెటకారంగా స్పందించడం చూసిన నెటిజనులు తీవ్రంగా విరుచుపడుతున్నారు. రష్మిక తన కెరీర్ తొలి కన్నడ సినిమా కిరిక్ పార్టీలో రక్షిత్, ప్రమోద్ శెట్టిలతో కలిసి నటించారు. ఆ సమయంలోనే రక్షిత్ తో రష్మిక ప్రేమలో పడ్డారు. అయితే నిశ్చితార్థం అనంతరం రష్మిక కెరీర్ కోసం తన నిర్ణయం మార్చుకోవడం చర్చకు వచ్చింది.
అయితే గతంలో ముగిసిపోయిన విషయాలను ఇప్పుడే గుర్తు చేయాల్సిన అవసరం ఏమిటని నెటిజనులు ప్రమోద్ శెట్టిని నిలదీస్తున్నారు. ప్రమోద్ వ్యాఖ్యలు రష్మిక అభిమానులకు, సామాన్య నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. అతడి వ్యాఖ్యలను `చీప్` (అల్పుడు) అని అభివర్ణిస్తున్నారు.
గతంలో విడిపోయిన తర్వాత కూడా రష్మిక వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి వెటకారపు వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు భావిస్తున్నారు. పెళ్లికి పిలవరని తెలిసి కూడా ఇలాంటి జోకులు వేయడం మీ అపరిపక్వతను చూపిస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. రష్మిక తన కెరీర్‌లో ముందుకు సాగుతుంటే.. పాత విషయాలను గుర్తు చేస్తూ ఆమెను తక్కువ చేసి మాట్లాడటం తగదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
రష్మిక లేదా విజయ్ దేవరకొండ తమ వివాహం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఉదయపూర్‌లో వివాహం జరగబోతుందనే వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. అయితే ప్రమోద్ శెట్టి వ్యాఖ్యలు మాత్రం కన్నడ, తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇతరులు చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారితీస్తుంటాయి. ఈ విషయంలో కూడా ప్రమోద్ శెట్టి తన పరిధి దాటి మాట్లాడారని మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం.
