DSP ‘ఎల్లమ్మ’లో ప్రకాష్ రాజ్ ఫిక్స్! ఎమోషన్స్‌తో భారీ కథ!
సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు నటుడిగా సరికొత్త అవతారమెత్తబోతున్నారు.
By: Madhu Reddy | 21 Jun 2026 12:31 PM ISTసంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు నటుడిగా సరికొత్త అవతారమెత్తబోతున్నారు. ‘బలగం’ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ "ఎల్లమ్మ". ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతుండగా.. తాజాగా వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ఈ మూవీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆయన ఒక అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
జూన్ నుంచే షెడ్యూల్ షురూ:
భావోద్వేగాలతో కూడిన ఒక పవర్‌ఫుల్ గ్రామీణ కథాంశంతో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ జూన్ మొదటి వారం నుంచే అధికారికంగా ప్రారంభమైంది. ఇక మొదటి షెడ్యూల్‌లో ప్రకాశ్ రాజ్‌తో పాటు మిగతా కీలక పాత్రధారులపై కొన్ని ముఖ్యమైన సీన్లను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ వంటి నటుడు ఉండడంతో ఈ సినిమాలో ఎమోషనల్ సీన్లు మరింత బలంగా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
జూలైలో ఎంట్రీ ఇవ్వనున్న హీరో డీఎస్పీ:
ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తన మిగతా సినిమాల మ్యూజిక్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ లోపు ‘ఎల్లమ్మ’ సినిమా కోసం ఆయన ఒక అద్భుతమైన థీమ్ మ్యూజిక్‌ను కూడా కంపోజ్ చేసినట్లు సమాచారం. తన మ్యూజిక్ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుని, జులై నెల నుండి డిఎస్పీ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. దీనికోసం ఆయన సరికొత్త రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు.
అంచనాలు పెంచుతున్న క్రేజీ కాంబినేషన్:
తెలంగాణ నేటివిటీతో ఎమోషన్స్‌ను పండించడంలో వేణు యెల్దండికి ఉన్న ప్రత్యేక గుర్తింపు, దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారడం, దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్ తోడవడంతో ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక కేవలం మ్యూజిక్‌తోనే కాకుండా.. ఇప్పుడు నటుడిగా కూడా డిఎస్పీ వెండితెరపై ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తాడా అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
కథకు ప్రాధాన్యతతో, మన సంస్కృతి నేపథ్యంతో రాబోతున్న ఎల్లమ్మ చిత్రం దేవి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారనుందని భావిస్తున్నారు. దీనికి తోడు ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటుడి అండ ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం ఇచ్చింది.మరి రాక్‌స్టార్ ఈ పాన్ ఇండియా ఎమోషనల్ డ్రామాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
