స్పిరిట్ 'ప్రకాష్ రాజ్'.. మద్యలో ఏం జరిగింది?
కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో లేరని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా కన్ఫర్మ్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం లేదని రీసెంట్ గా చెప్పారు.
By: M Prashanth | 22 Aug 2026 10:14 AM ISTస్పిరిట్ సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ సౌండ్ స్టోరీ వదిలినప్పుడు అందులో ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా వినిపించింది. అప్పుడే ఈ సినిమాలో ఆయనకు ఒక సాలిడ్ క్యారెక్టర్ ఉందని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంటూ కొన్ని రూమర్స్ వచ్చినా స్వయంగా ప్రకాష్ రాజ్ వాటికి చెక్ పెట్టారు. తన వంతు షూటింగ్ ఇంకా మొదలుకాలేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.
కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో లేరని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా కన్ఫర్మ్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం లేదని రీసెంట్ గా చెప్పారు. అయితే ఆయన ఎందుకు తప్పుకున్నారు, అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాలను మాత్రం ప్రణయ్ బయటపెట్టలేదు. దీంతో మొదట వాయిస్ తో పరిచయం చేసిన యాక్టర్ ను ఇప్పుడు సడెన్ గా ఎందుకు తప్పించారనే డౌట్స్ మొదలయ్యాయి.
సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రకాష్ రాజ్ రీసెంట్ గా పాలిటిక్స్ కి సంబంధించి చేస్తున్న కామెంట్స్ తరచూ వివాదాలు అవుతున్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయనను స్పిరిట్ నుంచి తీసేయాలని సోషల్ మీడియాలో ఒక వర్గం గట్టిగానే డిమాండ్ చేసింది. ఇప్పుడు నిజంగానే ఆయన సినిమాలో లేరని ప్రణయ్ చెప్పడంతో ఆ పాత ఇష్యూను మళ్లీ తెరపైకి తెస్తున్నారు.
అయితే ప్రకాష్ రాజ్ ను కేవలం రాజకీయ వ్యాఖ్యల వల్లే పక్కన పెట్టారనే విషయాన్ని ప్రణయ్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. మేకర్స్ కూడా అలాంటి రీజన్ ఏమీ చెప్పలేదు. ఒక నటుడి ప్రొఫెషన్ ను, ఆయన పర్సనల్ పొలిటికల్ ఒపీనియన్స్ ను కలపకూడదనే వాదన కూడా నెట్టింట గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు తమ సినిమాలో ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలి అనే నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు వంగా టీమ్ కే ఉంటుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు.
కానీ ఫిబ్రవరిలో సినిమాలో ఉన్నానని ప్రకాష్ రాజ్ చెప్పాక, ఈ ఆరు నెలల్లో ఏం మారిందో కరెక్ట్ రీజన్ చెప్పకపోవడం వల్లే ఈ కన్ఫ్యూజన్. కేవలం కొన్ని కారణాల వల్ల అని చెప్పి వదిలేయడం మరిన్ని ఊహాగానాలకు దారి తీస్తోంది. స్పిరిట్ సినిమా 2027 మార్చి 5న థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి కాస్టింగ్ మీద ముందు ముందు మరిన్ని అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ప్రకాష్ రాజ్ విషయంలో మాత్రం మేకర్స్ నుంచి ఒక ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. రిలీజ్ టైమ్ లో సందీప్ వంగా దీనిపై ఓపెన్ అవుతారా లేక ముందే ఒక ఎక్స్ ప్లనేషన్ ఇస్తారా అనేది వేచి చూడాలి.
