Begin typing your search above and press return to search.

పీసీ పాత రిలేషన్ గురించి కొత్తగా..!

ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ప్రహ్లాద్‌ కక్కర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం అయింది. ఆయన బాలీవుడ్‌లోని పలు విషయాల గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు

By:  Ramesh Palla   |   18 Sept 2025 7:00 AM IST
పీసీ పాత రిలేషన్ గురించి కొత్తగా..!
X

ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ప్రహ్లాద్‌ కక్కర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం అయింది. ఆయన బాలీవుడ్‌లోని పలు విషయాల గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. చాలా కాలంగా ఉన్న పుకార్ల విషయంలో క్లారిటీ ఇచ్చాడు. సమాధానం లేని ప్రశ్నలకు ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్ మొదలుకుని అభిషేక్‌ బచ్చన్‌-ఐశ్వర్య రాయ్ రిలేషన్‌, ప్రియాంక చోప్రా వర్సెస్ లారా దత్తా ఇలా చాలా విషయాల గురించి ప్రహ్లాద్‌ కక్కర్‌ స్పందించాడు. ఈ మధ్య కాలంలో ఒక ఫిల్మ్‌ మేకర్‌ ఇంటర్వ్యూ ఈ స్థాయిలో వైరల్‌ కావడం, వివాదాస్పదం కావడం ఇదే అంటూ చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఈ విషయాల గురించి ప్రముఖంగా మాట్లాడుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో మరింతగా చర్చకు తెర తీసినట్లు అవుతుంది.

సీరియస్‌ రిలేషన్‌షిప్‌లో ప్రియాంక చోప్రా

ఈయన ప్రియాంక చోప్రా గురించి మాట్లాడుతూ.. చాలా కష్టపడి, ఇబ్బందులను ఎదుర్కొని పైకి వచ్చిన నటి ప్రియాంక చోప్రా అన్నాడు. అయితే గ తంలో ప్రియాంక చోప్రాకు ఒక స్ట్రాంగ్‌ రిలేషన్‌షిప్ ఉండేది అన్నాడు. అయితే ఆ రిలేషన్‌షిప్‌ ఎవరితో అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ చాలా మంది షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా రిలేషన్‌షిప్‌ గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు, ఆ సమయంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది చాలా రకాల కథలు, కథనాలు అల్లేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ప్రతిభ ఉన్న కారణంగా ప్రియాంక చోప్రా తక్కువ సమయంలోనే టాప్‌ స్టార్‌గా నిలిచింది అనడంలో సందేహం లేదు. అయితే ఆమె హాలీవుడ్‌కి వెళ్లడంకు ఉన్న ప్రధాన కారణం ఏంటి అనేది ఇన్నాళ్లు పెద్ద సస్పెన్స్‌గా ఉండేది.

ప్రహ్లాద్‌ కక్కర్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రియాంక చోప్రా గొప్ప వ్యక్తిత్తం ఉన్న మనిషి. ఆమె దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి. ఆమెను ఒక బొమ్మగా ప్రహ్లాద్‌ అభివర్ణించాడు. కెరీర్‌ ఆరంభంలో ప్రియాంక కి చాలా లోపాలు ఉండేవి. ముఖ్యంగా నల్లగా ఉండటం, చర్మంకు సంబంధించిన సమస్యల వల్ల ఆమె ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం ఉందా అని చాలా మంది అనుకున్నారు. కానీ వాటన్నింటిని ఎదిరించింది. ఆమె మోడలింగ్‌లో ఉన్నప్పటి నుంచే లారా దత్తాతో పోటీ పడింది. ఇద్దరూ అందాల పోటీలో పోటీ పడటం తెలిసిందే. ఆ సమయంలో లారా దత్తా విజయం సాధించి ప్రియాంక చోప్రా రన్నర్‌గా నిలిచింది. అయితే సినిమాల్లో పూర్తి స్థాయిలో లారా దత్తా పై ప్రియాంక చోప్రా ఆధిపత్యం కనబర్చుతూ వచ్చింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగింది. ఇప్పటికీ ఆమె ఓకే చెప్తే పది సినిమాలు చేతిలో ఉంటాయి అనడంలో సందేహం లేదు.

మహేష్‌ బాబు, రాజమౌళి సినిమాలో పీసీ

ప్రహ్లాద్‌ కక్కర్‌ ఆ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా రిలేషన్‌ షిప్‌ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆమె ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాలి అనుకునేది కాదు. ఎప్పుడూ ఆ విషయం గురించి ఎక్కువగా స్పందించక పోవడం వల్లే ఆ విషయం నిజం, ఆ రిలేషన్‌షిప్ నిజం అనే అభిప్రాయం చాలా మందిలో ఉందని ఆయన అన్నాడు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా టాలీవుడ్‌లో మహేష్ బాబుకు జోడీగా రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమాను బిజినెస్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రియాంక చోప్రాను ఈ సినిమాలో రాజమౌళి భాగం చేసి ఉంటాడు అని చాలా మంది అంటున్నారు. మరో వైపు బాలీవుడ్‌లోనూ ఈమె రెండు మూడు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు హాలీవుడ్‌లో చేస్తూనే మరో వైపు ఇండియన్‌ సినిమాలను ఈమె చేస్తూ ఉంది.