ప్రశాంతమైన వాతావరణంలో యోగాసనాలతో బాలయ్య బ్యూటీ!
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో సందడి చేసే ప్రగ్యా జైస్వాల్ తాజాగా ప్రశాంతమైన వాతావరణంలో యోగాసనాలు చేస్తూ కనిపించింది.
By: Madhu Reddy | 12 Aug 2026 5:09 PM ISTసినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ఇంత ఫిట్ గా ఉండడం వెనుక.. నిత్యం యోగ, జిమ్ వర్కౌట్స్ వారి జీవనశైలిలో భాగం అయిన విషయం తెలిసిందే.. అందుకే ఐదు కాదు కదా ఆరు పదుల వయసులో కూడా సెలబ్రిటీలు అంతే యంగ్ గా కనిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే యోగా చేయాలి అంటే ప్రశాంతమైన వాతావరణం కూడా ఉండాలి. అలాంటి పచ్చని కొండల మధ్య అంతకు మించిన ప్రశాంతతను పొందుతూ యోగాసనాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో సందడి చేసే ప్రగ్యా జైస్వాల్ తాజాగా ప్రశాంతమైన వాతావరణంలో యోగాసనాలు చేస్తూ కనిపించింది. మంచు కొండల్లో పచ్చని ప్రాంగణంలో ప్రశాంతతను పొందుతూ యోగాసనాలు చేస్తూ.. చూసే వారిని కూడా ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్. ఏది ఏమైనా తన అందాలతో కాకుండా యోగాసనాలతో ఈసారి అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా మనలో కూడా యోగ చేయాలనే ఆలోచనను కలిగిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించిన ప్రగ్యా జైస్వాల్ పూణేలోని సింబయోసిస్ లా స్కూల్లో చదివింది. అలా చదువుతున్న సమయంలోనే పలు రకాల అందాల పోటీలలో పాల్గొని సక్సెస్ఫుల్ మోడల్ గా ఎదిగింది.. కళా, సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయానికి గాను సింబయాసిస్ సాంస్కృటిక్ పురస్కారం కూడా అందుకుంది. ఎన్నో ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్గా పనిచేసిన ప్రగ్యా జైస్వాల్ కొన్ని పాపులర్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా పనిచేసింది.
2015లో తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాలో నటించిన ఏమేం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఉత్తమ నటన కనబరిచినందుకుగాను ఉత్తమ నటి విభాగంలో గద్దర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక ,ఆచారి అమెరికా యాత్ర, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలు చేసింది. అయితే బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాతో మంచి విజయం లభించింది.
ప్రస్తుతం టైసన్ నాయుడు అనే చిత్రంలో నటిస్తున్న ఈమె.. సన్నీ డియోల్ క్రైమ్ థ్రిల్లర్ సూర్యలో కూడా నటిస్తోంది . పైగా ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
