Begin typing your search above and press return to search.

యోగా డే స్పెషల్.. విభిన్నమైన ఫోజులతో మెస్మరైజ్ చేసిన ప్రగ్యా జైస్వాల్!

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు యోగాసనాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే

By:  Madhu Reddy   |   21 Jun 2026 4:12 PM IST
యోగా డే స్పెషల్.. విభిన్నమైన ఫోజులతో మెస్మరైజ్ చేసిన ప్రగ్యా జైస్వాల్!
X

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు యోగాసనాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోయిన్లను మొదలుకొని హీరోల వరకు ఇంస్టాగ్రామ్ వేదికగా విభిన్నమైన ఫోజులతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్ కూడా విభిన్నమైన యోగ ఫోజులతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మరి ఆమె షేర్ చేసిన ఫోటోల గురించి ఇప్పుడు చూద్దాం..




ఆసనాలతో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్..

ప్రగ్యా జైస్వాల్ యోగాసనాలలో భాగంగా మూన్ ఫోజ్, హాఫ్ మంకీ ఫోజ్ అంటూ ఇలా పలు ఆసనాలు వేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా ఈ ఆసనాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది.




"నిజమైన ఆరోగ్యం అంటే కాలాన్ని వెనక్కి తిప్పడం కాదు.. అది సౌందర్యంతో ముందుకు సాగడం... మీ శరీరంతో అనుసంధానమై ఉండడం.. అలాగే ప్రతిరోజు మీకోసం మీరు ఒక సమయాన్ని కేటాయించుకోవడం.. అని యోగ నాకు నేర్పింది. ఎందుకంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే జీవితానికి సంవత్సరాలు జోడించడం కాదు.. అది మీ సంవత్సరాలకు జీవాన్ని జోడించడం.. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ యోగ డే సందర్భంగా స్పెషల్ ఫోజులతో అందరినీ ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్ . ప్రస్తుతం ఈమె ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




మోడల్ నుండీ నటిగా గుర్తింపు..

ప్రగ్యా జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో తన చదువును పూర్తి చేసిన ఈమె.. సింబయాసిస్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని మోడల్గా ఎదిగింది. కళా , సంస్కృతిక రంగంలో ఈమె సాధించిన విజయానికి గానూ 2014 జనవరి 22న సింబయాసిస్ సాంస్కతిక్ పురస్కారం కూడా లభించింది. ఇక మోడల్గా పలు అందాల పోటీలలో పాల్గొని కిరీటాలను కూడా దక్కించుకుంది.




అలా మోడల్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సమయంలో అనగా 2014లో తమిళ్ , తెలుగు ద్విభాష చిత్రమైన డేగ సినిమాలో అవకాశం లభించింది. ఆ తర్వాత టిట్టూ ఎంబీఏ అనే హిందీ చిత్రంతో హిందీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కానీ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈమె నటిగానే కాదు గాయని కూడా.. పైగా నృత్యం అంటే చాలా ఇష్టం. అలా ఒకవైపు తన ప్యాషన్ కొనసాగిస్తూనే.. మరొకవైపు నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా, అఖండ వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.