Begin typing your search above and press return to search.

స్వ‌ర్గం క‌ళ్ల ముందే బులుగు బికినీలో!

ప్రగ్యా జైస్వాల్ గతంలోనూ తన సోషల్ మీడియా వేదికగా పలు అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేసింది.

By:  Sivaji Kontham   |   11 April 2026 9:37 AM IST
స్వ‌ర్గం క‌ళ్ల ముందే బులుగు బికినీలో!
X

టాలీవుడ్ అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం మాల్దీవుల వెకేషన్‌లో విహరిస్తూ తన అభిమానులకు కనువిందు చేస్తోంది. నీలిరంగు బికినీలో సముద్రపు తీరాన దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ భామ దీనికి అంద‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది. ``ప్యారడైజ్ నుంచి చివరి ఫోటో`` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో ప్రగ్యా తన గ్లామర్‌తో నెటిజన్లను కట్టిపడేస్తోంది. కేవలం విహారయాత్ర కోసమే కాకుండా.. అక్కడి రిసార్టులకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ మాల్దీవుల పర్యాటకాన్ని తనదైన శైలిలో ప్రోత్సహిస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా గత కొన్నేళ్లుగా కుదేలైన పర్యాటక రంగం.. ముఖ్యంగా మాల్దీవుల్లోని ఎగ్జోటిక్ రిసార్టులు ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రగ్యా వంటి సెలబ్రిటీలు చేసే ఇటువంటి ప్రమోషన్స్ వల్ల పర్యాటకుల తాకిడి పెరిగి అక్కడి హోటళ్లు, రిసార్టుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు కథానాయికలు మాల్దీవుల రిసార్టుల ఆఫర్లను అందిపుచ్చుకుంటూ.. ఆ దీవుల అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్ గతంలోనూ తన సోషల్ మీడియా వేదికగా పలు అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేసింది. దుబాయ్, యూరోప్‌లోని కొన్ని బీచ్ రిసార్టులతో పాటు గోవాలోని లగ్జరీ హోటళ్ల కోసం ప్ర‌గ్య‌ గ్లామరస్ ఫోటోషూట్‌లలో పాల్గొంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో బికినీలతో చేసే ప్రమోషన్స్ బ్రాండ్ వాల్యూను పెంచడమే కాకుండా.. పర్యాటకులలో ఆ లొకేష‌న్ల‌పై విప‌రీత‌మైన‌ ఆసక్తి పెరిగింది. ఈ రకమైన `ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సింగ్` ఇప్పుడు సినీ తారలకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది.

ఇక ప్రగ్యా సినిమా కెరీర్ విషయానికి వస్తే.. త‌ను తెలుగులో చివరిగా నటించిన చిత్రం `అఖండ`. బాలకృష్ణ సరసన కలెక్టర్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హిందీలో `ఖేల్ ఖేల్ మే` వంటి చిత్రాల్లో మెరిసినా తెలుగులో గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. 2026లో ప్రగ్యా ప్రధాన పాత్రల్లో నటించిన రెండు పెద్ద సినిమాలకు సంత‌కాలు చేయ‌బోతోంద‌ని స‌మాచారం. ఇవి త‌న‌ కెరీర్‌కు మళ్ళీ పూర్వ వైభవాన్ని తెస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. బెల్లంకొండ‌తో టైస‌న్ నాయుడు ప్రాజెక్ట్ కొంత‌కాలంగా హోల్డ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కథానాయికలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా తమ పాపులారిటీని కాపాడుకుంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ కూడా అదే బాటలో నడుస్తూ అటు గ్లామర్, ఇటు బిజినెస్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. మాల్దీవుల వెకేషన్ ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత తన కొత్త సినిమాల షూటింగ్‌లలో పాల్గొననుంది.