బీచ్ రోడ్డున గ్లామర్ డోర్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్
ముఖ్యంగా తమకు నచ్చిన ప్రదేశానికి, నచ్చిన వారితో వెళ్తూ చిల్ అవుతున్న విషయం తెలిసిందే. పైగా అక్కడి విషయాలను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
By: Madhu Reddy | 27 Sept 2026 8:27 PM ISTనిత్యం వరుస సినిమాలు అంటూ బిజీగా గడిపే నటీనటులు కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ అంటూ స్నేహితులతో కలిసి సుదీర్ఘ ప్రయాణాలు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా తమకు నచ్చిన ప్రదేశానికి, నచ్చిన వారితో వెళ్తూ చిల్ అవుతున్న విషయం తెలిసిందే. పైగా అక్కడి విషయాలను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్లను సొంతం చేసుకుంటున్న ఈ భామలు.. మరింతగా దర్శకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారనటంలో సందేహం లేదు.
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు. ఒకవైపు సినిమా సినిమాలలో హుందాగా, సాంప్రదాయంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకునే ఈమె.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ వలకబోస్తూ కుర్రకారు ఫేవరెట్ గా మారిపోయింది. అందులో భాగంగానే తాజాగా తన స్నేహితులతో కలసి సరదాగా వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ ఆరెంజ్ కలర్ బికినీను తలపించేలా డ్రెస్ ధరించి తన గ్లామర్ తో హీటెక్కించింది.
అలాగే తన స్నేహితురాలు, ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ ఫారినర్స్ దగ్గర డాన్స్ చేసిన వీడియోలు కూడా ప్రగ్యా జైస్వాల్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఏది ఏమైనా వెకేషన్ లో భాగంగా ఇలా గ్లామర్ వలకబోస్తూ మరొకవైపు తన స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తున్న ఈ మూమెంట్ కి సంబంధించిన ఫోటోలు , వీడియోలు మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్గా తన కెరీర్ ను ప్రారంభించింది. సింబయాసిస్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే వివిధ రకాల అందాల పోటీల్లో పాల్గొని విజయవంతమైన మోడల్గా ఎదిగింది. కళా , సంస్కృతిక రంగంలో ఈమె సాధించిన విజయానికి 2014లో సింబయాసిస్ సాంస్కృతిక పురస్కారం లభించింది.
హీరోయిన్ గా అవతరించక ముందే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఈమె వ్యవహరించింది. 2014లో తొలిసారి తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రమైన డేగ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తొలిసారి తెలుగులో 2015లో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక తర్వాత కంచె సినిమాతో హీరోయిన్గా మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆచారి అమెరికా యాత్ర, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, జయ జానకి నాయక, సైరా వంటి చిత్రాలలో నటించింది. అయితే అఖండ సినిమా ఈమెకు మంచి పాపులారిటీ అందించింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో కలెక్టర్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్.
