Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : అందాల కంచె ఎత్తిన ముద్దుగుమ్మ

ప్రగ్యా జైస్వాల్‌ ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోల కారణంగా మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

By:  Ramesh Palla   |   29 Oct 2025 4:00 PM IST
పిక్‌టాక్‌ : అందాల కంచె ఎత్తిన ముద్దుగుమ్మ
X

'కంచె' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. టాలీవుడ్‌లో కంచె సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా కూడా నటీనటులకు మంచి పేరును తెచ్చి పెట్టింది. ముఖ్యంగా హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌కి కంచె సినిమా ల్యాండ్‌ మార్క్ సినిమాగా నిలిచింది అనడంలో సందేహం లేదు. కంచె సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్‌ టాలీవుడ్‌తో పాటు అన్ని సౌత్‌ ఇండియన్‌ భాషల్లోనూ బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ ప్రగ్య స్టార్‌గా నిలవలేక పోయింది. హీరోయిన్‌గా అడపా దడపా సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ అవి పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోవడం లేదు. దాంతో ఇప్పటికీ ఈమె ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.





సోషల్‌ మీడియాలో ప్రగ్యా జైస్వాల్‌...

ప్రగ్యా జైస్వాల్‌ ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోల కారణంగా మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ప్రగ్యా జైస్వాల్‌ ఎప్పటిలాగే మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోలతో నిరూపితం అయింది. థైస్‌ అందాలను చూపిస్తున్న ఈ అమ్మడు క్లీ వేజ్‌ షో తో మతి పోగొట్టింది. విభిన్నమైన ఈ ఔట్‌ ఫిట్‌ లో ప్రగ్యా చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉన్న పాపం దక్కాల్సిన విజయాలు దక్కడం లేదు, పొందాల్సిన ఆఫర్లు పొందడం లేదు అంటూ చాలా మంది ప్రగ్యా పై సానుభూతి తెలియజేస్తున్నారు.





కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో...

ఎప్పటిలాగే ప్రగ్యా తన లుక్‌తో కట్టి పడేస్తూ ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్‌ తో పోల్చితే ప్రగ్యా జైస్వాల్‌ చాలా అందంగా ఉంది, అయినా కూడా ఆమెకు రావాల్సిన ఆఫర్లు రావడం లేదు అనేది చాలా మంది విమర్శ. ప్రగ్యా హైట్‌ కాస్త ఎక్కువ కారణంగా ఆమెతో నటించేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపించరు అనేది కొందరి అభిప్రాయం. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి అని ప్రగ్యా జైస్వాల్‌ ఉదంతం చెప్పకనే చెబుతోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసే హీరోయిన్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. వారితో పోల్చినా కచ్చితంగా ప్రగ్యా జైస్వాల్‌ అందం విషయంలో ముందు ఉంటుంది. కానీ అదృష్టం మాత్రం ఈ అమ్మడికి కలిసి రాలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ప్రగ్యా జైస్వాల్‌

ప్రగ్యా జైస్వాల్‌ కంచె సినిమాకు ముందు తమిళ చిత్రం విరాట్టు తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తమిళ సినిమా ప్రగ్యా జైస్వాల్‌కి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత చేసిన సినిమా కూడా హిట్‌ కాలేదు. తెలుగులోనూ కంచె సినిమా ఈమెకు మొదటి సినిమా కాదు. తెలుగులో ఈమె మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో నటించింది. ఆ సినిమాలో అభిజిత్‌ కు జోడీగా 2015 లో నటించింది. ఆ సినిమా వచ్చిన కొన్నాళ్లకు కంచె సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి అవుతున్నా ఇప్పటికీ ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలతో అయినా ఈ కంచె బ్యూటీకి ఆఫర్లు మరిన్ని రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలను మీరు ఒక లుక్కేయండి.