గ్లామర్ షోతో కవ్వించడంలో ప్రగ్య తర్వాతే
టాలీవుడ్ ట్యాలెంటెడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తనదైన అందం- గ్లామర్ షోతో కుర్రకారును కవ్వించడంలో ఎప్పుడూ ముందుంటుంది.
By: Sivaji Kontham | 25 April 2026 11:46 PM ISTటాలీవుడ్ ట్యాలెంటెడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తనదైన అందం- గ్లామర్ షోతో కుర్రకారును కవ్వించడంలో ఎప్పుడూ ముందుంటుంది. `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ సుందరి.. ఆ తర్వాత బాలకృష్ణ సరసన `అఖండ` వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయినా ఆశించిన స్థాయిలో అవకాశాలను దక్కించుకోవడంలో ప్రగ్య తడబడుతోంది. అయితే సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ ఫాలోయింగ్‌ను నిలబెట్టుకోవడంలో ప్రగ్యా తర్వాతే ఎవరైనా అనిపించుకుంటోంది.
తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక రీల్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బ్లాక్ కలర్ హాఫ్ షోల్డర్ ఫ్రాక్ ధరించి ఈ బ్యూటీ ఇచ్చిన స్ట్రైకింగ్ ఫోజులు నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఈ డ్రెస్సులో ప్రగ్యా తన పర్ఫెక్ట్ బాడీ కర్వ్‌లను ప్రదర్శిస్తూ.. కెమెరా ముందు కిల్లింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తోంది. కేవలం అందం మాత్రమే కాకుండా ప్రగ్య క్యారీ చేసిన స్టైల్, ఫ్యాషన్ సెన్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం ప్రగ్యాకు టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు కొంతమేర తగ్గాయి. టాలీవుడ్ తర్వాత బాలీవుడ్‌లో పాగా వేయాలని ఈ బ్యూటీ గట్టిగానే కలలు కంది. హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని ప్రయత్నాలు చేసినా.. అక్కడ కూడా తనకు ఆశించిన స్థాయిలో బ్రేక్ లభించలేదు. దీంతో కొంత నిరాశ చెందిన ప్రగ్య ఒక సెలబ్రిటీగా తనకున్న గుర్తింపును కాపాడుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
సినిమాలు తక్కువగా ఉన్నా.. ప్రగ్యా జైస్వాల్ తన పాపులారిటీని క్యాష్ చేసుకుంటోంది. ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడు టీవీ ప్రకటనల్లో కనిపిస్తూ మంచిగానే ఆర్జిస్తోంది. గ్లామర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం సినిమాలే కాదు... నిరంతరం వార్తల్లో ఉండటం కూడా ముఖ్యమని గ్రహించిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఫ్యాషన్ ప్రియులను అలరిస్తోంది.
సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్ తగ్గకుండా ప్రగ్యా ఎంతో జాగ్రత్త పడుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్స్, ఫిట్‌నెస్ వీడియోలు - గ్లామరస్ రీల్స్‌తో అభిమానులను పలకరిస్తూనే ఉంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ బ్లాక్ డ్రెస్ ఫోటోలు చూస్తుంటే..త్వరలోనే ఏదో ఒక భారీ ప్రాజెక్టుతో మళ్ళీ వెండితెరపై మెరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
