Begin typing your search above and press return to search.

పింక్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్న బాలయ్య బ్యూటీ!

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నటి, మోడల్ అంజనా బోహ్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పింక్ కలర్ లెహంగా సెట్ ను ప్రగ్యా జైశ్వాల్ ధరించింది.

By:  Madhu Reddy   |   3 Sept 2025 1:00 PM IST
పింక్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్న బాలయ్య బ్యూటీ!
X

ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే అకేషన్ ఏదైనా సరే అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇంకొంతమంది ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి గ్లామర్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. చిత్రవిచిత్రమైన దుస్తులు ధరిస్తూ అలరిస్తున్నారు. ఇంకొంతమంది అందాలు ఆరబోసేలా ఫోటోలు షేర్ చేస్తే.. మరికొంతమంది సాంప్రదాయంగా కనిపించి అబ్బురపరుస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బాలయ్య బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ కూడా వచ్చి చేరింది. ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను ఈ ముద్దుగుమ్మ షేర్ చేసుకుంది. అందులో తన అవుట్ ఫిట్ తో అందరినీ ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.


అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నటి, మోడల్ అంజనా బోహ్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పింక్ కలర్ లెహంగా సెట్ ను ప్రగ్యా జైశ్వాల్ ధరించింది. ముఖ్యంగా పెళ్లికి , పండుగలకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయడంలో ప్రసిద్ధి చెందిన అంజనా తాజాగా ప్రగ్యా జైశ్వాల్ కోసం.. పింక్ కలర్ పట్టు వస్త్రంపై క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ తో డిజైన్ చేసిన లెహంగాను రూపొందించింది. ఇది ధరించిన ప్రగ్యా జైశ్వాల్ తన అందాన్ని దుస్తులతో మరింత రెట్టింపు చేసుకుందని చెప్పవచ్చు. పింక్ కలర్ లెహంగా ఈమె మేనిఛాయను మరింత మెరిసేలా చేస్తూ.. చూపరులను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ ధరించిన ఈ అవుట్ ఫిట్ అభిమానులను మరింత అలరిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ప్రగ్యా జైశ్వాల్ కెరియర్ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించింది. పూణె లోని సింబయాసిస్ లా స్కూల్ లో తన విద్యను పూర్తి చేసింది. అక్కడ చదువుకునే సమయంలోనే వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని సక్సెస్ సాధించిన ఈమె.. కళా, సంస్కృతి రంగంలో ఈమె సాధించిన విజయానికి 2014 జనవరి 22న సింబయాసిస్ సాంస్కృటిక్ పురస్కారం కూడా లభించింది. మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె ఫెమినా మిస్స్ ఇండియా 2018 పోటీలలో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ వంటి టైటిల్స్ ను దక్కించుకుంది. అలాగే రిలయన్స్ డిజిటల్, ఎఫ్బిబి, మిలీనియమ్ హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్ వంటి పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది.


సినీ ప్రయాణం విషయానికి వస్తే.. 2015లో 'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కంచె' సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇటీవల ఉత్తమ నటి విభాగంలో గద్దర్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు అఖండ 2 సినిమాలో కూడా నటిస్తోంది