బ్యాక్ ఫీటు బావుందమ్మోవ్.. మైకోనోస్ బీచ్ అదిరిందమ్మోవ్.. ప్రగ్య రచ్చ రచ్చ!
గ్లామరస్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ జర్నీ, లైఫ్ స్టైల్ గురించి తెలుగు వారికి పరిచయం చేయనవసరం లేదు.
By: Sivaji Kontham | 11 Sept 2026 9:14 AM ISTగ్లామరస్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ జర్నీ, లైఫ్ స్టైల్ గురించి తెలుగు వారికి పరిచయం చేయనవసరం లేదు. కంచె సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ జర్నీ ఇటీవల పూర్తిగా స్లో అయిపోయింది. నేను స్లో అంటూ అంగీకరిస్తూనే.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలలో నిత్యం యమ ఫాస్ట్ గా ఉంది. రెగ్యులర్ గా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. తాజాగా ఈ భామ గ్రీస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మైకోనోస్ నగరంలో విహరిస్తూ నెటిజనుల గుండెల్లో గుబులు పుట్టించింది.
హలో మైకోనోస్ అంటూ లవ్ ఈమోజీలతో రెచ్చిపోయింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు ఈ అందమైన ఫోటోగ్రాఫ్స్‌పై లైకులు, కామెంట్లతో రీయాక్ట్ అవుతూ ట్రెండ్ చేస్తున్నారు.
ఈ విహారయాత్రలో ప్రగ్యా ధరించిన అవుట్‌ఫిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. `స్టూడియో వెరాండా` డిజైన్ చేసిన స్టైలిష్ డిజైనర్ డ్రెస్‌లో ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. దీనికి తోడు ఐ జ్యువెలరీ ఇయర్ రింగ్స్, `ఐ మోడ్` సన్ గ్లాసెస్, `ఫ్లటర్ ఫుట్‌వేర్`తో తన లుక్‌ను మరింత ట్రెండీగా మార్చుకుంది. ప్రముఖ స్టైలిస్ట్ నటాషా బోత్రా పర్యవేక్షణలో మిచెలా, మౌస్మి మిత్రాల బృందం ఈ బ్యూటీని ఎంతో అందంగా స్టైలింగ్ చేసారు. ఈ లుక్‌కు డిజైనర్ బ్రాండ్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపించారు.
సినిమా ఆఫర్లు తగ్గినా ప్రగ్యా జైస్వాల్ గ్లోబ్ ట్యాగ్‌లా ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తోంది. కనీసం ప్రొఫెషనల్ ట్రావెల్ బ్లాగర్‌గా పాపులర్ కాకపోయినా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ట్రావెలింగ్ అనుభవాలను, ఆయా ప్రాంతాల విశేషాలను అభిమానులతో షేర్ చేస్తోంది. గతంలో కూడా ఈ భామ యూరప్ ఖండంలోని పలు అందమైన దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. గ్లామరస్ ట్రావెల్ ఫోటోషూట్లతో వార్తల్లో నిలిచింది.
ఇక టాలీవుడ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో ప్రగ్యాకు తెలుగులో అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. `కంచె` సినిమాతో మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని ఎన్బీకే సరసనా అవకాశాలు దక్కించుకున్నా కానీ.. ఆ తర్వాత ఆ స్థాయి అవకాశాలను అందుకోవడంలో వెనుకబడింది. బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` విజయం సాధించినా.. తన కెరీర్‌కు అది పెద్దగా మైలేజ్ ఇవ్వలేకపోయింది. అగ్ర హీరోల సినిమాల్లో కొత్త నీరులా యంగ్ హీరోయిన్ల ఎంట్రీ పెరగడం కూడా ఈ సీనియర్ భామకు అవకాశాలు తగ్గడానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరైన హిట్ పడితే తప్ప టాలీవుడ్‌లో మళ్లీ పుంజుకోవడం కష్టమే అయినా ప్రగ్యా మాత్రం సోషల్ మీడియా గ్లామర్ ప్రదర్శనతో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. కొత్త అవకాశాల కోసం వేచి చూస్తూనే.. మరోవైపు తన పర్సనల్ లైఫ్‌ను.. విహారయాత్రలను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. మునుముందు రోజుల్లో ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్ నుంచి ఎలాంటి అవకాశాలు వస్తాయో వేచి చూడాలి.
