బీచ్ సైడ్ అలాంటి పని మొదలెట్టిన బాలయ్య బ్యూటీ.. ఎక్స్పెక్ట్ చేయలేదుగా!
ప్రస్తుతకాలంలో హీరోయిన్స్ కాస్త విరామం దొరికిందంటే చాలు వెకేషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు.
By: Madhu Reddy | 2 Dec 2025 10:30 AM ISTప్రస్తుతకాలంలో హీరోయిన్స్ కాస్త విరామం దొరికిందంటే చాలు వెకేషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో భాగంగానే సముద్ర తీరాన జలకాలాడుతూ సేద తీరుతూ తమ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది వినూత్నంగా బీచ్ సైడ్ ఎవరూ ఊహించని పనులు చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలయ్య బ్యూటీ కూడా కాస్త వెకేషన్ కి వెళ్ళింది. అయితే అక్కడ చిల్ అవ్వడమే కాకుండా బీచ్ సైడ్ అలాంటి పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అభిమానులు సైతం దీనిని మేము ఎక్స్పెక్ట్ చేయలేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తాజాగా మాల్దీవ్స్ కి వెకేషన్ కు వెళ్ళింది.అక్కడ స్విమ్ సూట్ ధరించి ఎంజాయ్ చేస్తున్నట్టు కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. బికినీ ధరించి మరీ సముద్ర తీరాన చిల్ అవుతున్న ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇంకొక వైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మనసును మరింత ప్రశాంతంగా మార్చుకుంటున్నట్టు ఆ ఫోటోలను పంచుకుంది.
అంతేకాదు బీచ్ సైడ్ ఒక చెఫ్ వద్ద కుకింగ్ కూడా నేర్చుకుంటున్నట్లు ఒక వీడియో కూడా షేర్ చేసింది. చెఫ్ ఆధ్వర్యంలో ఎగ్ ను బ్రేక్ చేసే ప్రయత్నం చేయగా.. అది కాస్త కింద పడిపోయింది. అలా కుకింగ్ లో కొత్త ప్రయోగం చేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి అయితే బీచ్ సైడ్ ఇలా కుకింగ్ లో మెలుకువలు నేర్చుకునే ప్రయత్నం చేసింది ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.
ప్రగ్యా జైస్వాల్ కెరియర్ విషయానికి వస్తే.. మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో కట్టుబొట్టు సాంప్రదాయంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందే మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత గుంటూరోడు, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా నరసింహారెడ్డి, అఖండ వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. నిజానికి బాలయ్య హీరోగా వచ్చిన అఖండ సినిమాతోనే ఊహించని పాపులారిటీ అందుకుంది.
ఇటీవల వచ్చిన డాకు మహారాజు సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ప్రగ్య. ఇక ప్రస్తుతం సినిమా అవకాశాలు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో ఇలా వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
