Begin typing your search above and press return to search.

పొట్టి నిక్కర్లో బాలయ్య బ్యూటీ సెగలు!

ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ కి కొదవ లేకుండా రోజుకొక అవుట్ ఫిట్ తో అటు ప్రేక్షకులను ఇటు నెటిజన్ లను అలరించే ఈమె.

By:  Madhu Reddy   |   16 Jun 2026 11:25 PM IST
పొట్టి నిక్కర్లో బాలయ్య బ్యూటీ సెగలు!
X

అఖండ సినిమాలో కలెక్టర్ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ వరుసగా సినిమాలు చేస్తోంది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈమధ్య అవకాశాలు అందుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాలలో చేసినప్పటికీ.. సరైన క్రేజ్ లేకపోవడం గమనార్హం. ఎలాగైనా సరే మంచి హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఈమె మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

పొట్టి నిక్కర్ లో చెమటలు పట్టించిన ప్రగ్యా జైస్వాల్..

ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ కి కొదవ లేకుండా రోజుకొక అవుట్ ఫిట్ తో అటు ప్రేక్షకులను ఇటు నెటిజన్ లను అలరించే ఈమె.. తాజాగా పొట్టి నిక్కర్లో బికినీను తలపించేలా డ్రెస్ ధరించి అందాలు ఆరబోసింది. క్రీమ్ కలర్ లేస్ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ మినీ క్రాప్ టాప్ ధరించిన ఈమె దీనికి కాంబినేషన్లో బాటమ్ వైట్ డెనిమ్ షార్ట్ ధరించి ఫోజులిచ్చింది. తన లుక్కును ఫుల్ ఫిల్ చేసుకోవడానికి వైట్ షర్ట్ ను ధరించిన ఈమె.. చేతుల వరకు మాత్రమే ధరించి మరో ఫ్యాషన్ ట్రెండ్ కి పునాది వేసింది. అలా మొత్తానికైతే ఈమె ధరించిన ఈ ట్రెండీ ఔట్ ఫిట్ యువతను విపరీతంగా అలరిస్తోంది.

లా స్కూల్ నుండీ నటనారంగం వైపు..

ప్రగ్యా జైస్వాల్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించింది. ఇక పూణేలోని సింహయాసిస్ లా స్కూల్లో విద్యను అభ్యసించిన ఈమె సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లోనే వివిధ రకాల అందాల పోటీల్లో పాల్గొని సక్సెస్ఫుల్ మోడల్ గా ఎదిగింది .2008 ఫెమినా మిస్ ఇండియా పోటీలలో మిస్ ఎర్త్, మిస్ డాన్సింగ్ క్వీన్ వంటి టైటిల్స్ అందుకున్న ఈమె ఇటు పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. మిలీనియం హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్, ఎఫ్ బీ బీ , రిలయన్స్ డిజిటల్, డాబర్ వాటిక, డవ్ వంటి ఎన్నో పాపులర్ బ్రాండ్స్ కి పనిచేసింది.

ఎన్నో అభిరుచు లు కూడా..

సినిమా మీద ఇష్టంతో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత పనిచేసిన కంచె సినిమాతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది.. ఇక బాలకృష్ణ నటించిన అఖండ, డాకూ మహారాజ్ సినిమాలలో నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది ప్రగ్యా జైస్వాల్. ఇక ఈమెకు నృత్యం అంటే చాలా ఇష్టం. అంతేకాదు మంచి గాయని కూడా.. ప్రముఖ స్టార్ హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్ , నాగార్జున అంటే ప్రత్యేక అభిమానం.. అలాగే ఇష్టమైన హీరోయిన్స్ విషయానికి వస్తే అనుష్క, మాధురి దీక్షిత్ లను ఈమె ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటుంది. పైగా నలుపు, తెలుపు, ఎరుపు అంటే చాలా ఇష్టపడే ఈమె.. లండన్ తన ఫేవరెట్ డెస్టినేషన్ గా చెబుతూ ఉంటుంది.