Begin typing your search above and press return to search.

పచ్చని ప్రకృతిలో ప్రగ్యా జైస్వాల్…మాయ చేస్తోన్న ముద్దుగుమ్మ..!

ఈ ఫోటోను మౌర్య అనే ఫోటోగ్రాఫర్ తీశారు. ఆమె వేసుకున్న డ్రెస్ మిస్ మోసా అనే బ్రాండ్ నుంచి.. తీసుకోగా.. చెవులకు వేసుకున్న ఆభరణాలు, చేతి ఆభరణాలు రుబాన్స్ బ్రాండ్ చెందినవి.

By:  Priya Chowdhary Nuthalapti   |   22 Jan 2026 10:34 PM IST
పచ్చని ప్రకృతిలో ప్రగ్యా జైస్వాల్…మాయ చేస్తోన్న ముద్దుగుమ్మ..!
X

కంచె సినిమాతో తనకంటూ ఎంతో ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే తెగ ఆకట్టుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో.. మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో ఆమె పూర్తిగా ప్రకృతి మధ్య.. పచ్చని వాతావరణంలో కనిపిస్తూ... గ్రీన్ కలర్ డ్రెస్‌లో అందానికే అసూయ తెప్పించేలా.. నిలబడుకొని ఫోటోలకు ఫోజు ఇచ్చింది. “నేను అవుట్‌డోర్సీ అని చెప్పినప్పుడు అర్థం ఇదే”.. అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. పచ్చని గడ్డి, చెట్ల మధ్య నిలబడి ఉన్న ప్రగ్యా లుక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఆమె డ్రెస్ రంగు కూడా చుట్టూ ఉన్న ప్రకృతికి బాగా మ్యాచ్ అయింది.

ఈ ఫోటోను మౌర్య అనే ఫోటోగ్రాఫర్ తీశారు. ఆమె వేసుకున్న డ్రెస్ మిస్ మోసా అనే బ్రాండ్ నుంచి.. తీసుకోగా.. చెవులకు వేసుకున్న ఆభరణాలు, చేతి ఆభరణాలు రుబాన్స్ బ్రాండ్ చెందినవి. వేళ్లకు ఉన్న ఉంగరాలు అనంతయ బై మణి నుంచి వచ్చాయి. ఈ మొత్తం లుక్‌ను నటాషా బోత్రా స్టైలింగ్ చేశారు. స్టైలింగ్ టీమ్‌గా మిచియెలా, మౌస్మి మిత్ర పని చేశారు. మేకప్‌ను అతిరా థక్కర్ చేశారు. హెయిర్ స్టైలింగ్‌ను అమిత్ ఠాకూర్ చేశారు.

ఒక మధ్యప్రదేశ్లో పుట్టిన ప్రగ్యా జైశ్వర్ కెరియర్ విషయానికి వస్తే.. 2014లో తమిళ సినిమా ‘విరట్టు’తో ఆమె నటిగా పరిచయం అయ్యారు. అదే ఏడాది హిందీ సినిమా టిటూ ఎంబీఏలో కూడా నటించారు.2015లో వచ్చిన తెలుగు సినిమా కంచె ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో రాజకుమారి పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో ఆమె ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు కూడా గెలుచుకున్నారు. తర్వాత నక్షత్రం,‌అచారి అమెరికా యాత్ర,‌ అఖండ.. వంటి సినిమాల్లో నటించారు. అఖండ ఆమె కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది.

ఇటీవల హిందీలో ఖేల్ ఖేల్ మేన్ సినిమాలో నటించిన ప్రగ్యా.. గత సంవత్సరం బాలకృష్ణ తో డాకు మహారాజ్ సినిమాలో కనిపించింది. ఇక ఈ హీరోయిన్ మళ్లీ తెలుగు సినిమాల్లో ఎప్పుడూ కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ.