Begin typing your search above and press return to search.

సిట్టింగ్ ఫోజులతో హీట్ పుట్టిస్తున్న బాలయ్య బ్యూటీ!

గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రగ్యా జైస్వాల్ మరొకసారి హీట్ పుట్టించేలా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   26 Jun 2026 10:44 AM IST
సిట్టింగ్ ఫోజులతో హీట్ పుట్టిస్తున్న బాలయ్య బ్యూటీ!
X

గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రగ్యా జైస్వాల్ మరొకసారి హీట్ పుట్టించేలా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందాలతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరొకసారి సిట్టింగ్ ఫోజులతో సెగలు పుట్టించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. సినిమాలలో అవకాశాలు లేకపోతేనేమ్ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువలో ఉంటే చాలు అనే రేంజ్ లో ప్రవర్తిస్తోంది.





అందులో భాగంగానే తాజాగా షోల్డర్ లెస్ బ్లాక్ వన్ పీస్ వెల్వెట్ డ్రెస్ ధరించిన ఈమె సిట్టింగ్ ఫోజులతో హీట్ పుట్టించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. భిన్న విభిన్నమైన భంగిమలలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తానికైతే ప్రగ్యా జైస్వాల్ సెగలు పుట్టించేలా ఈ వర్షాకాలం అలాంటి ఫోటోలు షేర్ చేసి మళ్లీ వైరల్ గా మారింది.





1991 జనవరి 12న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జన్మించిన ఈమె పూణే లోని సింబయాసిస్ లా స్కూల్ నుండి విద్యను పూర్తి చేసింది. ఎన్నో అందాల పోటీలలో పాల్గొని మోడల్గా పేరు దక్కించుకున్న ఈమె.. ఎన్నో పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. మోడల్ గా తన అందాలతో ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించిన ప్రగ్యా జైస్వాల్ .. 2014లో తొలిసారి విరట్టు అనే తమిళ చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2015లో అభిజిత్ సరసన మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.





రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో రావు రమేష్, షకలక శంకర్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జయ నాగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఈ సినిమాతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

కానీ అదే ఏడాది మరో తెలుగు రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం కంచె ద్వారా మరోసారి ఆకట్టుకుంది . క్రిష్ రచనా దర్శకత్వంలో మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. పైగా ఈ సినిమాతో పలు అవార్డులు కూడా దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక , ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలలో నటించిన ప్రగ్యా జైస్వాల్ తొలిసారి అఖండ సినిమాతో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు కానీ పెద్దగా అనుకున్నంత స్థాయిలోఅవకాశాలు లభించలేదు.

ఇక తర్వాత సన్నాఫ్ ఇండియా అనే సినిమా చేసి కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి..మళ్లీ 2025లో డాకు మహారాజ్ లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం టైసన్ నాయుడు చిత్రంలో నటిస్తోంది . మరి ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.