ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రగతి.. ఇప్పటికైనా ఆపుతారా?
చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటి ప్రగతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 11 Dec 2025 12:39 PM ISTచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటి ప్రగతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు పలు చిత్రాలలో నటిస్తూ.. తల్లిగా, అత్తగా, అక్కగా, వదినగా ఇలా పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. కరోనా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. పలు రకాల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసిన ఈమె.. తీన్మార్ స్టెప్పులతో పబ్లిక్ లో సందడి చేసి.. మరింత పాపులారిటీ అందుకుంది.
ఇదిలా ఉండగా.. కరోనా సమయంలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఆ తర్వాత దానినే ఛాలెంజ్ గా తీసుకొని నేడు ఆసియా లెవెల్ లో పథకాలు గెలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ పథకాలు సాధించడమే కాకుండా 50 సంవత్సరాలు వయసుకు చేరువలో కూడా ఇలాంటి పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనడమే కాకుండా పథకాలు కూడా గెలుపొందడంతో అందరూ ఆమె టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 లో కూడా పాల్గొని నాలుగు పథకాలు గెలుచుకుంది. ఇక ఈ అద్భుతమైన విజయంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రగతి పేరు విపరీతంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రగతి సాధించిన ఈ అరుదైన ఘటనపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా గతంలో ఈమె జిమ్లో వర్కౌట్స్ చేస్తూ పెట్టిన ఫోటోలకు కొంతమంది నెగటివ్గా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీటిపై స్పందించి ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రగతి. విషయంలోకి వెళ్తే.. తాజాగా త్రీ రోజెస్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రగతి ఈ ట్రోలర్స్ పై స్పందించింది. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఈమె సాధించిన ఘనతకు ప్రత్యేకగా ఈమెను సన్మానించింది చిత్రం బృందం. అనంతరం ప్రగతి మాట్లాడుతూ.. "నేను ఈ జర్నీ మొదలుపెట్టినప్పుడు ఈ వయసులో నీకు అవసరమా? జిమ్ లో జిమ్ము బట్టలే వేసుకోవాలి. జిమ్ లో చుడీదార్లు, చీరలు కట్టుకోని చేయలేము కదా.. మొదట్లో నాకు కూడా అనుమానం వచ్చింది. ఇంతమంది నాపై నెగటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు కదా.. నేనేమైనా తప్పు చేస్తున్నానా అని. ఇంత దరిద్రంగా తిడుతున్నారే..ఇంత అసహ్యంగా ఫీలయ్యేలా చేస్తున్నారే నేనేం అంత తప్పు చేశాను అని నాకు నేనే అనుమానపడ్డాను.
ఎదిగిన కూతురు ఉంది. ఆ పిల్ల కాలేజీకి వెళ్తుంది. ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత మాటలు అనేది.. చాలా బాధపడ్డాను. కానీ ఈ ట్రోలర్స్ కి గట్టిగా సమాధానం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నేను సాధించిన ఈ పథకాలే ఈ ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ అని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పటికైనా ఈ ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రగతి.
అలాగే తాను సాధించిన ఈ మెడల్స్ ఇండస్ట్రీలో ఉండే ప్రతి మహిళకి అంకితం చేసింది. ఏది ఏమైనా తన అద్భుతమైన విజయాలతో అందరి నోర్లు మూయించి తన విజయాన్ని సినీ పరిశ్రమకు చెందిన ఆడవారికి అంకితం చేయడం అనేది నిజంగా ప్రశంసనీయమంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
