ఆ యంగ్ హీరోతో పాటు తెలుగు హీరో!
కోలీవుడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాధ్ టాలీవుడ్ లో ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే.
By: Srikanth Kontham | 20 Dec 2025 1:08 PM ISTకోలీవుడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాధ్ టాలీవుడ్ లో ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు భాషతో, ప్రాంతంతో పనిలేదని కంటెంట్ నచ్చితే ఎలాంటి వారినైనా ఆదరిస్తారు అనడానికి ప్రదీప్ నెటి జనరేష్ యువతకు ఉదాహ రణగా నిలిచాడు. ఇప్పటి వరకూ అతడు హీరోగా నటించిన `లవ్ టుడే`, ` డ్రాగన్`, `డ్యూడ్` చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరో సినిమా `లవ్ ఇన్సురెన్స్ కంపెనీ `రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతోంది.
మరో తెలుగు హీరో:
కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రదీప్ మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కడానికి సిద్దమవుతున్నాడు. ప్రదీప్ `లవ్ టుడే` తర్వాత ఇతర దర్శకులతోనే సినిమాలు చేసాడు. దర్శకుడిగా పని చేయలేదు. దీంతో వచ్చే ఏడాదిలో మాత్రం దర్శకుడిగా కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు. ఇప్పటికే ఓ సైన్స్-ఫిక్షన్ సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సినిమా లకు భిన్నంగా ఇది ఉంటుందని వెల్లడించాడు. అందులో ప్రదీప్ ఓ హీరోగా నటించనున్నాడు. అలాగే స్క్రిప్ట్ డిమాండ్ మేరకు మరో నటుడు అవసరమని తెలిసింది.
ప్రదీప్ కి పోటీగా ఎవరు?
ఈ నేపథ్యంలో ఆ పాత్రకు తెలుగు నటుడినే తీసుకోవాలనుకుంటున్నాడుట. మరీ కొత్త నటుడు కాకుండా టైర్ 3 రేంజ్ హీరో అయితే బాగుంటుందని భావిస్తు న్నాడుట. కథలో రెండు పాత్రలు పోటాపోటీగా ఉంటాయట. ఒకరు ఎక్కువ? మరొకరు తక్కువా? కాకుండా రెండు పాత్రలను బ్యాలెన్స్ గా రాసినట్లు చెబుతున్నారు. మరి ఆ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. నిఖిల్, సందీప్ కిషన్ లాంటి నటులైతే పర్పెక్ట్ గా యాప్ట్ అవుతారు. వీళ్లు అయితే మార్కెట్ పరంగానూ కలిసొస్తారు.
ఎవరా? ఛాన్స్ తీసుకుంటారు:
నిఖిల్, తేజ సజ్జాలైతే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటులు కూడా. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. మరి రంగనాధ్ మైండ్ లో వారున్నారా? అప్రోచ్ అయితే వాళ్లు అంగకరిస్తారా? వాళ్లను మించిన నటుల్ని తీసుకోవాలను కుంటున్నాడా? ఇలా ఎన్నో సందేహాలు లేకపోలేదు. అలాగే ఇదే సినిమాలో హీరోయిన్లు ఎవరు? అన్నది ఆసక్తికరమే. ప్రదీప్ సరసన హీరోయిన్లు అంటే మార్కెట్లో ఓ వైబ్ ఉంటుంది. అతడి ఇమేజ్ కు తగ్గ పర్పెక్ట్ నాయికల్ని ఎంచుకుంటాడు. ఇవానా, కదయాదు లోహార్, అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే అతడితో రొమాన్స్ చేసారు. కాబట్టి కొత్త భామలవైపు చూసే అవకాశం ఉంది.
