'ది ఆల్ఫా యూనిట్'.. అశ్వత్ మారిముత్తు అవుట్.. ప్రదీప్ రంగనాథన్ సినిమాలోకి తరుణ్ భాస్కర్!
ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం మొదట 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వత్ మరిముత్తును అనుకున్నారట.
By: Madhu Reddy | 23 Oct 2026 6:19 PM ISTకోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. 'లవ్ టుడే' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఆయన.. తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ 'PR షో' బ్యానర్‌ను ప్రారంభించారు. ఈ కొత్త బేనర్‌పై ఒక క్రేజీ ఫీమేల్-సెం్రిక్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాత్కాలికంగా 'PRS01' అని పిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
తరుణ్ భాస్కర్ ఎంట్రీ.. అశ్వత్ మారిముత్తు అవుట్;
ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం మొదట 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వత్ మరిముత్తును అనుకున్నారట. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక ఆయన స్థానంలో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కం యాక్టర్ తరుణ్ భాస్కర్ ఆ పాత్రలోకి ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ లాంటి క్రియేటివ్ పర్సన్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
హీరోయిన్గా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు:
ఇక ఈ చిత్రంలో కథానాయికగా, ప్రధాన పాత్రలో మలయాళ బ్యూటీ మమితా బైజు నటిస్తోంది. 'ప్రేమలు' సినిమాతో యూత్‌కు ఫేవరెట్‌గా మారిన మమితా బైజు.. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ నిర్మాణంలో వస్తున్న ఈ తొలి చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేయడం విశేషం.ఇక రీసెంట్ గా వచ్చిన విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ తో సూపర్ హిట్ ను తన ఖాతా లో వేసుకుంది. ఇక తనదైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించే ఆమె, ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఎలాంటి అద్భుతం చేయనుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆరుగురు యువ దర్శకుల 'ది ఆల్ఫా యూనిట్';
ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఒక్క డైరెక్టర్ కాకుండా, ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్స్‌గా పనిచేసిన ఆరుగురు యువ దర్శకుల ప్రతిభావంతులైన బృందం 'ది ఆల్ఫా యూనిట్' సంయుక్తంగా తెరకెక్కిస్తోంది. అలాగే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ప్రముఖ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ప్రదీప్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం.
ఇక మొత్తానికి చూస్తే, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు నిర్మాతగా మారి ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. తరుణ్ భాస్కర్ ఎంట్రీ, మమితా బైజు నటన, అసిస్టెంట్ డైరెక్టర్ల కలయికతో రాబోతున్న ఈ సినిమా కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో భారీ క్రేజ్‌ను సంతరించుకుంటోంది.
