పాపం ప్రదీప్‌ను ఎక్కువ ఎక్కేస్తున్నారా..?
ఇటీవల డ్యూడ్ సినిమా యొక్క ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఆ కార్యక్రమంకు మంచి స్పందన వచ్చింది.
By: Ramesh Palla | 15 Oct 2025 3:43 PM ISTసోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో హీరోలను ఏ స్థాయిలో అభిమానిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారో చూస్తున్నాం. అదే సమయంలో కొందరు హీరోలు తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. హీరోలు నెగిటివిటీని తట్టుకుని నిలదొక్కుకుంటూనే ఇండస్ట్రీలో రాణించగలరు. అయితే కొన్ని సార్లు నెగిటివిటీ తారా స్థాయికి చేరుతుంది. అప్పుడు కూడా హీరోలు సైలెంట్‌గానే ఉంటున్నారు. హీరోలు ఎక్కువ సింపుల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్న విషయం అయినా ఓవర్ యాక్షన్ చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి తెలుసు. అయినా కూడా ఏదో ఒక సమయంలో వారు మీమర్స్‌కి దొరికి పోతారు. ఏదో ఒక సమయంలో నోరు జారడం లేదా వారు చేసే పని వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు తమ ప్రమేయం లేకుండానే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్‌లు ఎదుర్కొంటున్నారు.
డ్యూడ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో...
ఇటీవల డ్యూడ్ సినిమా యొక్క ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఆ కార్యక్రమంకు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రచారం కోసం, జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో స్టేజ్‌పై హీరో ప్రదీప్, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌లు ప్రదర్శణ ఇచ్చారు. ఇప్పుడు అదే వారు ట్రోల్ అయ్యేలా చేస్తోంది. సినిమా పబ్లిసిటీ కోసం చేసిన పని ఇప్పుడు వారిని తీవ్రంగా ట్రోల్ అయ్యేలా చేస్తుంది. స్టేజ్ పై రెండు సినిమాల హిట్‌తోనే ప్రదీప్ రంగనాథన్ ఓ సూపర్ స్టార్ రేంజ్‌లో ప్రవర్తిస్తున్నాడు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఆడియో వేడుక స్టేజ్ పై ప్రదీప్ ప్రవర్తన కొత్తగా అనిపించింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రదీప్ లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆ రెండు హిట్స్‌తోనే ప్రదీప్ బాడీ లాంగ్వేజ్‌లో మార్పు వచ్చినట్లుగా అనిపిస్తోందని చాలా మంది అంటున్నారు.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన డ్యూడ్...
ప్రదీప్ రంగనాథన్ తనను తాను ఒక రజనీకాంత్... ఒక ధనుష్ అన్నట్లుగా ఫీల్ అవుతున్నాడు అని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రదీప్ ను సమర్ధించే వారు ఎక్కువ మంది ఉన్నారు. కెరీర్ ఆరంభం నుంచి ప్రదీప్ చాలా డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా ఉంటాడు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా కొందరు కావాలని ఆయన్ను బ్యాడ్ చేసే ఉద్దేశంతో డ్యూడ్ ఆడియో వేడుకను విమర్శిస్తున్నారు అంటూ ప్రదీప్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలుగు మీడియా ముందు ప్రదీప్ రంగనాథ్ మాట్లాడిన మాటలు, ఆయనను విమర్శించినట్లుగా ఉన్న ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం కూడా ఆయన డౌట్ టు ఎర్త్ అన్నట్లుగా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఉన్నట్లుండి అటిట్యూడ్ అంటూ విమర్శించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనే అభిప్రాయంను ఆయన ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
మమిత బైజు, నేహా శెట్టి హీరోయిన్స్‌గా డ్యూడ్...
డ్యూడ్ సినిమా ఆడియో వేడుకలో ప్రదీప్, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌లు కేవలం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు స్టేజ్ షో ఇచ్చారు తప్ప, వారి అటిట్యూడ్‌ను చూపించేందుకు కాదు అని వారికి మద్దతుగా నిలుస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి సాయి అభ్యంకర్, ప్రదీప్‌ను సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకి పారేస్తున్నారు. వారు చేసిన దానికి ఈ స్థాయిలో విమర్శించడం కరెక్ట్ కాదని వారికి మద్దతుగా నిలుస్తున్న వారు అంటున్నారు. ఈ ట్రోల్స్ పై ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డ్యూడ్ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో ప్రదీప్‌కి జోడీగా మమిత బైజు హీరోయిన్‌గా నటించగా డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. డ్యూడ్ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో సమాంతరంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది.
