హీరో మెటీరియల్ కాదు.. ధనుష్‌ని అనుకరిస్తారేంటి?
మీరు హీరో మెటీరియల్ కాదు.. ఇంత ఫాలోయింగ్ ఎలా మీకు? అని మరో జర్నలిస్ట్ సూటిగా ప్రదీప్ ని ప్రశ్నించారు. దానికి ప్రదీప్ కాకుండా అతడి పక్కనే ఉన్న సీనియర్ నటుడు శరత్ కుమార్ జవాబిచ్చారు.
By: Sivaji Kontham | 10 Oct 2025 10:00 AM ISTతమిళ యువహీరో ప్రదీప్ రంగనాథన్ నేటితరంలో ప్రతిభావంతమైన నటుడిగా నిరూపించుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. 2022లో లవ్ టుడే చిత్రంతో కథానాయకుడిగా ఆరంగేట్రం చేసిన ప్రదీప్ రంగనాథన్ ని అభిమానులు ధనుష్ తో పోల్చి చూడటం ఆసక్తికరం.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన `డూడ్` ప్రమోషన్స్ లో ప్రదీప్ రంగనాథన్ కి రెండు విచిత్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఎక్కడా నొచ్చుకోకుండా అతడు సమాధానం ఇచ్చాడు. `డూడ్` ప్రచారంలో మీరు ధనుష్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా, దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు.
నేను సన్నగా ఉన్నాను కాబట్టి లేదా నా ఫేస్ కట్ చూసి అలా పోలుస్తున్నారు. కానీ నేను ఏదీ కావాలని చేసే ప్రయత్నం కాదు. తెలిసి ఏదీ చేయను! అని ప్రదీప్ వివరణ ఇచ్చారు. తనకు ధనుష్ లా కనిపించాలనే ఆలోచన లేదని అతడు స్పష్ఠం చేసాడు. నాకు ఇది ప్లస్ అవుతందా లేదా మైనస్ అవుతుందా అనేది నాకు తెలియదు. నేను అద్దంలో చూసుకున్నప్పుడు నన్ను నేను చూసుకుంటాను.. అని కూడా అన్నాడు.
మీరు హీరో మెటీరియల్ కాదు.. ఇంత ఫాలోయింగ్ ఎలా మీకు? అని మరో జర్నలిస్ట్ సూటిగా ప్రదీప్ ని ప్రశ్నించారు. దానికి ప్రదీప్ కాకుండా అతడి పక్కనే ఉన్న సీనియర్ నటుడు శరత్ కుమార్ జవాబిచ్చారు. ``ఇక్కడ ఉన్నవారంతా హీరో మెటీరియలే..దానికంటూ ప్రత్యేక లక్షణాలు ఏవీ ఉండవు. సమాజానికి మేలు చేసే పని చేసే ఎవరైనా హీరోనే!`` అని వివరణ ఇచ్చారు. మొత్తానికి డూడ్ వేదికపై ప్రదీప్ రంగనాథన్ కి కొన్ని సూటి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి సమాధానాలు అంతే పర్ఫెక్ట్ గా కనెక్టయ్యాయి. డూడ్ చిత్రం ఈనెల 17న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
" చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా అతనిని సమర్థించుకుంటూ, "ప్రదీప్ రంగనాథన్ ప్రదీప్ రంగనాథన్. మీరు చెబుతున్న నటుడు నాకు కనిపించడం లేదు" అని అన్నాడు.
ప్రదీప్ రంగనాథన్ గురించి
అతను నిర్మిస్తున్న లఘు చిత్రాలతో ఆకట్టుకున్న రవి మోహన్ మరియు వెల్స్ ఇంటర్నేషనల్ 2019లో కోమలితో ప్రదీప్‌కు మొదటి దర్శకత్వ అవకాశాన్ని ఇచ్చారు. అతను ఈ చిత్రంలో అతిధి పాత్రలో కూడా నటించాడు. 2022లో, అతను లవ్ టుడే చిత్రానికి దర్శకత్వం వహించి నటించాడు, ఇది అతన్ని ఇంటి పేరుగా మార్చింది. ఈ సంవత్సరం, అతను డ్రాగన్‌లో నటించాడు. మమిత బైజు కూడా నటించిన డ్యూడ్ చిత్రం దీపావళికి అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. అతను త్వరలో కృతి శెట్టితో కలిసి విఘ్నేష్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కంపానీలో కూడా కనిపించనున్నాడు.
