Begin typing your search above and press return to search.

2040లో లవ్ ఇన్సూరెన్స్: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ టీజర్ ఎలా ఉంది?

దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) తెలుగు టీజర్ విడుదలైంది.

By:  M Prashanth   |   1 April 2026 1:21 PM IST
2040లో లవ్ ఇన్సూరెన్స్: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ టీజర్ ఎలా ఉంది?
X

​‘లవ్ టుడే’ సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్ మరోసారి ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) తెలుగు టీజర్ విడుదలైంది. 2040వ సంవత్సరం నాటి ప్రపంచాన్ని చూపిస్తూ సాగే ఈ టీజర్, టెక్నాలజీ యుగంలో ప్రేమ ఎలా ఉంటుందనే విషయాన్ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేసింది.




ఫ్యూచరిస్టిక్ విజువల్స్, అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ టీజర్ లో హైలైట్‌గా నిలిచాయి. ​సాధారణంగా ప్రేమకథలంటే ఒకే మూసలో సాగుతాయనే కామెంట్ వస్తుంటుంది. కానీ విఘ్నేష్ శివన్ ఈసారి రూటు మార్చి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ను జోడించారు. టీజర్ లో కనిపించిన గ్రాఫిక్స్, అడ్వాన్స్‌డ్ రోబోలు, గాల్లో ఎగిరే ట్యాక్సీలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. ముఖ్యంగా బేగంపేట ఫ్లైఓవర్ పక్కన మెట్రో ట్రైన్ వెళ్తున్న విజువల్స్ మనల్ని నిజంగానే 2040 కాలంలోకి తీసుకెళ్తాయి.

తమిళ సినిమా అయినా తెలుగు అనువాదం విషయంలో పక్కా క్లారిటీ మెయింటైన్ చేసినట్లు అర్ధమవుతుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే కాన్సెప్ట్ చుట్టూ కథ నడుస్తుందని టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ​ఈ టీజర్ లో డైలాగ్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. “ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది.. మనం ఇప్పుడు 2040లో ఉన్నాం” అనే రోబో వాయిస్ తో టీజర్ మొదలవుతుంది. హీరో ప్రదీప్ రంగనాథన్ తన మార్క్ మ్యానరిజమ్స్ తో ఆకట్టుకున్నారు.

“ఒక అమ్మాయిని చూడగానే తల నుంచి కాలి వేలి వరకు ఒక ఫీలింగ్ వచ్చింది మామ” అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అలాగే “లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇంకా ఉందండి” అని హీరో చెప్పే మాటలు కథలో ఎమోషన్ కు కూడా చోటు ఉందని సూచిస్తున్నాయి. ​టీజర్ లో కొన్ని సన్నివేశాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. హీరోయిన్ కృతి శెట్టి తన ఫోన్ లో రకరకాల లవ్ రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడుతుంటే, హీరో మాత్రం ప్యూర్ లవ్ కోసం వెతకడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇక ఎస్.జె. సూర్య తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి హంగామా చేశారు. రోబోలు మనుషుల ప్రేమను విశ్లేషించడం, ‘చీటింగ్ డిటెక్టెడ్’ అంటూ వార్నింగ్‌లు ఇవ్వడం వంటి సీన్స్ సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పకనే చెబుతున్నాయి.​నిర్మాణ విలువల పరంగా చూస్తే రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఎక్కడా వెనకాడలేదు. అనిరుధ్ రవిచందర్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ కు ఒక ఎనర్జీ ఇచ్చారు.

ప్రతి ఫ్రేమ్ లోనూ 2040 నాటి హైదరాబాద్ సిటీని చాలా అందంగా చూపించారు. ప్రదీప్ రంగనాథన్ కు మరో సక్సెస్ ఇచ్చేలా కనిపిస్తోంది. టెక్నాలజీ పెరిగినా మనుషుల మధ్య ఉండే సహజమైన ప్రేమ మారదనే పాయింట్ ను దర్శకుడు చాలా తెలివిగా టీజర్ లో చూపించారు. ఇక భవిష్యత్తు ప్రేమలు ఎలా ఉంటాయి అనే పాయింట్ ను సినిమాలో చూపించనున్నట్లు అర్ధమవుతుంది. ​పలు వాయిదాల తర్వాత మేకర్స్ ఏప్రిల్ 10 రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. టీజర్ లో ఉన్న క్వాలిటీ చూస్తుంటే విఘ్నేష్ శివన్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. సమ్మర్ హాలిడేస్ కు పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా ఈ సినిమా కనిపిస్తోంది. మరి 2040 లో ప్రదీప్ రంగనాథన్ లవ్ స్టోరీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.