ప్రదీప్ రంగనాథన్: హ్యాట్రిక్ 100 కోట్లు.. ఇదేం అరాచకం రా బాబు!
అలాంటిది, చేసిన మొదటి మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కొల్లగొట్టడం అంటే అది మామూలు విషయం కాదు, అదొక అరాచకం.
By: M Prashanth | 29 Oct 2025 5:10 PM ISTఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టడమే పెద్ద టాస్క్. అలాంటిది, చేసిన మొదటి మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కొల్లగొట్టడం అంటే అది మామూలు విషయం కాదు, అదొక అరాచకం. ఇప్పుడు తమిళ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ సరిగ్గా ఇదే ఫీట్ సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక యూనిక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ రేంజ్ కన్సిస్టెన్సీ ఇప్పటివరకు ఏ యంగ్ హీరో చూపించలేదని చెప్పవచ్చు.
అసలు ప్రదీప్ జర్నీనే చాలా ఇంట్రెస్టింగ్. డైరెక్టర్‌గా మారి, 'కోమలి'తో డీసెంట్ హిట్ కొట్టిన అతను, 'లవ్ టుడే'తో హీరోగా మారాడు. ఆ సినిమా కాన్సెప్ట్ ఫోన్లు మార్చుకోవడం, ఆ యూత్‌ఫుల్ టేకింగ్ తమిళనాడునే కాదు, తెలుగు రాష్ట్రాలను కూడా ఊపేసింది. చిన్న సినిమాగా రిలీజై, బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించి, ఈజీగా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఆ ఒక్క సినిమాతో ప్రదీప్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
'లవ్ టుడే' తర్వాత ప్రదీప్‌పై ప్రెషర్ మామూలుగా లేదు. "ఇది లక్ అంతే, నెక్స్ట్ సినిమాతో తేలిపోతాడు" అని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ, ప్రదీప్ ఆ ప్రెషర్‌ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేశాడు. 'డ్రాగన్'తో మళ్లీ వచ్చాడు. ఈసారి యాక్షన్ జానర్ ట్రై చేశాడు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము దులిపేసింది. తమిళ్, తెలుగు కలిపి ఈ సినిమా కూడా 100 కోట్ల మార్కును దాటేసింది. దీంతో, ప్రదీప్ కేవలం వన్ ఫిల్మ్ వండర్ కాదని ప్రూవ్ అయింది.
ఇక ఇప్పుడు, రీసెంట్‌గా దీపావళికి రిలీజైన 'డ్యూడ్'తో ప్రదీప్ తన హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా, మొదటి నాలుగు రోజుల్లోనే 83 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, ఈజీగా 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో, తన మొదటి మూడు సినిమాలతోనూ 100 కోట్లు కొట్టిన ఏకైక ఇండియన్ యాక్టర్‌గా ప్రదీప్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
అతను పక్కాగా యూత్ పల్స్ పట్టుకున్నాడు. వాళ్లకు కనెక్ట్ అయ్యే కాన్సెప్టులు, రిలేటబుల్ క్యారెక్టర్లు, ఫ్రెష్ స్క్రీన్‌ప్లే.. ఇదే అతని బలం చెప్పవచ్చు. దానికి తోడు, తన సినిమాలకు సంబంధించిన రైటింగ్ భాగంలో తన సలహాలు ఇవ్వడం వంటివి కూడా ప్లస్ అవుతోంది. ఒక రకంగా దర్శకుడు వేరేవారైనా తన విజన్‌ను స్క్రీన్ మీదకు పర్ఫెక్ట్‌గా వచ్చేలా సపోర్ట్ చేస్తున్నాడు. ఇక ఈ హ్యాట్రిక్ 100 కోట్ల సక్సెస్ అతనిపై అంచనాలను, బాధ్యతను మరింత పెంచింది. మరి, ఈ స్ట్రీక్‌ను అతను నెక్స్ట్ ఎలా కంటిన్యూ చేస్తాడో చూడాలి.
