ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ ట్రైలర్.. మళ్లీ వాళ్ల టార్గెట్ తోనే..!
కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా డ్యూడ్. కీర్తీశ్వరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటించింది.
By: Ramesh Boddu | 9 Oct 2025 11:43 AM ISTకోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా డ్యూడ్. కీర్తీశ్వరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటించింది. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో యూత్ ఆడియన్స్ కు బాగా దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ తో ప్రేమలుతో యువత మనసులు గెలిచిన మమితా జత కట్టడం ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డ్యూడ్ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
ప్రదీప్ రంగనాథ్, మమితా బైజు జతగా..
ఈ ట్రైలర్ చూస్తే ప్రదీప్ రంగనాథ్ మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో వస్తున్నాడని అనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ తో పనిచేసే అతను.. సిగరెట్ తాగడం మానేయాలని తన ప్రేయసి చెప్పడంతో చాక్లెట్ తింటూ అలానే మానేస్తాడు. ఐతే ప్రేయసిని దక్కించుకునే క్రమంలో అతను ఏం చేశాడు అన్నది సినిమా కథ. ఇందులో ప్రేమలు మమితా బైజు తనతో జత కట్టగా సినిమాలో డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటించినట్టు ఉంది.
ట్రైలర్ యూత్ కి కావాల్సినంత స్టఫ్ ఉంది. ఎలాగు ప్రదీప్ చేసిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు ఆడియన్స్ కు సూపర్ గా కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ సినిమా కూడా అదే టార్గెట్ తో వస్తుందని చెప్పొచ్చు. ట్రైలర్ అంతా కూడా ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీతో అదరగొట్టాడు. లవ్, ఎమోషనల్, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్ని సమపాళ్లలో సినిమాలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను ప్రదీప్ తో చేయాలని గట్టిగా ఫిక్స్ అయిన కీర్తీశ్వరన్ అతను ఒప్పుకునే వరకు ట్రై చేశాడు.
డ్యూడ్ ట్రైలర్ ఇంప్రెస్..
ఫైనల్ గా డ్యూడ్ ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. అక్టోబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి ఒక మంచి జోష్ ఇస్తుందని చెప్పొచ్చు. ప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన మమితా ఈ డ్యూడ్ తో కూడా అదరగొట్టే ఛాన్స్ ఉన్నట్టే ఉంది. ఐతే సినిమాలో ఆమె రోల్ ని పెద్దగా చూపించలేదు. ప్రదీప్, మమితా ఇద్దరు తమ న్యాచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటారనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే ప్రదీప్ మరో యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ కూడా సూపర్ క్రేజ్ తీసుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ఆడియన్స్ కు బాగా నచ్చేశాయి.
